Sanjay Dutt In Rajasaab: సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలతో మంచి గుర్తింపుని సంపాదించుకొని వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిటిని క్రియేట్ చేసుకావాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. అందువల్లే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో గొప్ప గౌరవాన్ని మూట గట్టుకునే ప్రయత్నం లో అయితే ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం… ఇక మారుతి(Maruthi) డైరెక్షన్ లో చేస్తున్న (Rajasaab) సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే కొద్దిసేపటి క్రితమే ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాకు సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ టీజర్ లో తను వింటేజ్ లో ఎలాగైతే నటించి ప్రేక్షకులను మెప్పించాడో ఇప్పుడు కూడా అలాంటి సాహసమే చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తను భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నప్పటికి ప్రతి ప్రేక్షకులకు ఒక భారీ విజువల్ వండర్స్ ని చూపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మధ్యలో కొంచెం రిలాక్స్ గా ఉండటానికి ఆయన ఈ సినిమాని చేసినట్టుగా ఆయన గతంలో వివరించాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ భారీ సక్సెస్ ను సాధించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ టీజర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో సంజయ్ దత్ మెయిన్ రోల్ లో నటించినట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు ఆయన ఆ ఇంటిలో ఉండి ఏదో ఒక చెడు పని చేసి ఆ ఇంట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. దాంతో ఆ ఇంటి మీద ఉన్న మమకారంతో అతను దెయ్యంలా మారి ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్లను చంపేస్తూ ఉంటాడు. ప్రభాస్ తో పాటు అతని ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆ ఇంట్లోకి చేరుకోవడంతో ఆ ఇంట్లోనే వాళ్ళను బంధించి వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది… మరి సంజయ్ దత్ (Sanjay Dutt) ని ఎవరు చంపారు…
Also Read: Prabhas : ప్రభాస్ కి లెగ్ ఇంజురీ అయిందా..? 5 cr పెట్టి టూర్ వెళ్లడం వెనక అసలు కారణం ఇదేనా..?
ఆయన మరణం వెనక ఉన్న కారణం ఏంటి ఆ ఇంటి మీద ఉన్న మమకారాన్ని ఆయన ఎందుకు వదులుకోవడం లేదు.?అనే విషయాన్ని ఈ సినిమాలో కోర్ పాయింట్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రభాస్ ద్వారా సంజయ్ తన రివెంజ్ ను తీర్చుకుంటాడా?
లేదా ప్రభాస్ మీదే తను రివెంజ్ ను తీర్చుకోవాలని చూస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలైతే లేవు. కానీ టీజర్ ని చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఇదొక హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుంది అనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా తెలుసుకున్నారు.
ఇక టీజర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడంతో ప్రేక్షకులందరు ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి డిసెంబర్ 5వ తేదీన రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…