HomeతెలంగాణRevanth Reddy Vs KCR: రేవంత్ vs కేసీఆర్.. బూతుల్లో తగ్గేదేలే.. ఇదేం రాజకీయం?

Revanth Reddy Vs KCR: రేవంత్ vs కేసీఆర్.. బూతుల్లో తగ్గేదేలే.. ఇదేం రాజకీయం?

Revanth Reddy Vs KCR: తెలంగాణలో తిట్ల దండకం మళ్లీ మొదలైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కేసీఆర్‌ ఒక్కరే ఈ పనిచేసేవారని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కూడా కేసీఆర్‌తో పోటీ పడుతన్నాయని అంటున్నారు. చూస్తుంటే తెలంగాణలో తిట్ల దండకం పోటీ నడుస్తున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవతలి పార్టీ ఒక్క మాట అంటే.. ఇవతలి పార్టీ తామేం తక్కువ అన్నట్లు నాలుగు తిట్లు ఎక్కువే తిడుతోంది. దీంతో గతంలో హుందాగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు ఎటుపోతున్నాయి అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రజామోదం పొందేలా విమర్శలు ఉండేవి. పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితమయ్యేవి. నాయకులు కూడా తమ పరిధి మేరకే విమర్శలు చేసేవారు. హుందాగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. నేతలు సహనం కోల్పోతున్నారు. ఏ సర్టిఫికెట్‌ సినిమాకన్నా దారుణంగా ఉంటున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విమర్శ వికృత రూపం దాలుస్తోందన్న ఆందోళన కనిపిస్తోంది.

మొదలు పెట్టిందెవరు?
తెలంగాణలో తిట్ల పురాణం మొదలు పెట్టింది ఎవరని పరిశీలిస్తే.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా కేసీఆర్‌ నాటి ఆంధ్రా పాలకులపై కొంత మొరటు భాష వాడేవారు. ఇందేంటని కొందరు ప్రశ్నిస్తే తెలంగాణ భాష ఇలాగే ఉంటుందని, తెలంగాణలో ఇలాంటి పదాలు కామనే అని సమర్థించుకునే వారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు కూడా కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కానీ, తెలంగాణ సాధించిన తర్వాత, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం హోదాలో హుందాగా మాట్లాడాల్సిన గులాబీ నేత.. తెలంగాణ ఉద్యమకాలం నాటి భషనే విపక్షాలపై వాడడం మొదలు పెట్టారు. దీంతో తెలంగాణ సమాజం కొత్తలో స్పందిచంకపోయినా రానురాను కేసీఆర్‌ భాష సృతి మించడంతో నిశితంగా గమనిస్తూ వచ్చింది. ఇలా కేసీఆర్‌ తిట్లదండకంలో ఛాంపియన్‌గా నిలిచారు.

తర్వాత విపక్షాలు..
ఇక సీఎం పదవిలో ఉన్న కేసీఆర్‌ తిట్ల దండకంతో విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. ఆ భాషరాని నేతలు సున్నితంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా మాట్లాడితే పార్టీలకు మైలేజీ రాకపోవడంతో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ అధిష్టానాలు కూడా కేసీఆర్‌కు మాటకు మాట సమాధానం ఇచ్చే నేతలు తెలంగాణలో పార్టీలకు అధ్యక్షులుగా ఉండాలని భావించాయి. ఈ క్రమంలో బీజేపీకి బండి సంజయ్‌ని, కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిని చేశాయి. ఈ ఇద్దరు నేతలూ.. భాషలో, తిట్ల దండకంలో కేసీఆర్‌ను ఫాలో అయ్యారు. కేసీఆర్‌ ఒక్క మాట అంటే.. రివర్స్‌గా రెండు మాటలు ఎక్కువే అనడం మొదలు పెట్టారు.

కేసీఆర్‌ తిట్ల దండకం ఇలా..
భాష విషయంలో హుందాగా వ్యవహించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆరే నాడు ఇష్టానుసారం మాట్లాడారు. చేతగాని దద్దమ్మ, గాడిద కొడుకు, మగతనం, ఏంపీకడానికి, దుర్మార్గులు, బుట్ట చోర్‌గాళ్లు, చిల్లరగాళ్లు, కిరికిరిగాళ్లు కిరాయిగాళ్లు, మెడను నాలుగు ముక్కలు చేస్తా, తలకాయ ఆరు వక్కలు చేస్తా, నాకొడుకా, బేవకూఏఫ్, లంగ మాటలు, క ఉక్కల కొడుకులు, ఇజ్జత్‌ మానం ఉందా.. నాలుక చీరేస్తాం, తలకాయ లేనోడు వంటి పదాల ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు. కేటీఆర్‌ కూడా తానేం తక్కువ కాదన్నట్లు చిల్లర నాయాళ్లు, డఫర్‌ నాయకుళ్లారా, బఫూన్‌ నాయకుళ్లారా, లుచ్చా, లఫూట్, లోఫర్‌ వంటి పదాలు వాడరు.

ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా..
ఇక నాడు పీసీసీ చీఫ్‌గా, నేడు సీఎంగా రేవంత్‌రెడ్డి కూడా తిట్ల దండకంలో ఎక్కడా తగ్గడం లేదు. ఆవేశ పూరిత ప్రసంగాలతో తరచూ చెప్పు తీసుకుని పండ్లు రాలగొట్లాలె.. సిగ్గు శరం, చీము నెత్తురు ఉందా, సన్నాసి, బొంద పెట్టాలి. తొక్కుతం, కుక్కలు, నక్కలు, దండుపాళ్యం బ్యాచ్, ఫాంహౌస్‌ స్టార్, డ్రగ్స్‌ స్టార్, లిక్కర్‌ స్టార్, వెన్నుపోటు స్టార్‌ బందిపోటు స్టార్‌ వంటి పదాలు వాడుతున్నారు. నాడు సీఎంగా కేసీఆర్‌ భాషను తప్పు పట్టిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు తాను సీఎం అయ్యాక కూడా అదే భాష వాడుతున్నారు. సీఎం హోదారు మర్చిపోయి మాట్లాడుతున్నారు. చిప్ప కూడుతు తినిపిస్తం అంటూ పదే పదే విమర్శిస్తున్నారు.

మొత్తంగా ఇలా తెలంగాణ రాజకీయాల్లో తిట్ల దండకం పోటీ కొనసాగుతోంది. విమర్శకు ప్రతివిమర్శ చేయడం అటుంచితే నువ్వు తిడితే నేను పడతానా అన్నట్లు నేతలు వ్యవహరిస్తున్నారు. నీదేం భాష అంటే నీదేం భాష అని విమర్శిస్తున్నారు కానీ, భాష మార్చుకునేందుకు ఎవరూ ప్రయత్నం చేయడం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular