Liquor Shops Bandh: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు కార్పొరేషన్లు, 115 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. పట్టణ ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఇక శుక్రవారం(ఫిబ్రవరి 13న) ఓట్ల లెకి‍్కంపు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇప్పటికే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈమేరకు నోటీసులు ఇచ్చింది.
కౌంటింగ్ ముగిసే వరకూ..
తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు అన్ని వైన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సజాగంగా జరిగేలా చూడటానికి ఈ నిర్ణయం. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.