Kukatpally MLA Krishna Rao: కల్వకుంట్ల కవిత.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంతో దేశ వ్యాప్తంగా కూడా గుర్తింపె తెచ్చుకున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నంతకాలం కవిత ఐదేళ్లు ఎంపీగా ఉన్నారు.. మరో ఐదేళ్లుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల పార్టీ అధినేత.. తన తండ్రికి పార్టీలోని లోపాల గురించి లేఖ రాయడం ద్వారా సంచలనం లేపారు. ఫలితంగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం కవిత తెలంగాణ జాగతి పేరుతో జనం బాట నిర్వహిస్తూ.. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నెలరోజులుగా సాగుతున్న ఈ యాత్ర తుది దశకు చేరుకుంది. అయితే ఏ జిల్లాలో పర్యటించినా ఆమె అక్కడి బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను మాత్రమే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడడం లేదు. తాజాగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన కూడా అదే స్థాయిలో స్పందించారు.
కుక్క పోలిక..
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కుక్కతో పోల్చి మండిపడ్డారు. ఆమె రహస్యంగా దోపిడీలకు పాల్పడినట్లు ఆరోపించారు. బట్టలు, బంగారు దుకాణాలు లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు చేశారు. తన అత్తింటి ప్రాంతంలో ఓటర్ల మద్దతు పొందలేకపోయిన కవిత ఇతరులపై విమర్వలు చేయడం ఏంటని నిలదీశారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు కవిత చేసిన బాగోతాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ గుట్టు విప్పితే తట్టుకోలేవని హెచ్చరించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకుంటే.. నువ్వు.. నీ మొగడు ఏడుంటరో తెలుసు’ అని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
అన్నను జైలుకు పంపాలి.. హరీశ్‌ను వెళ్లగొట్టాలి..
ఇక మాధవరం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై కవిత భారీ కుట్ర చేసిందని ఆరోపించారు. పార్టీ నుంచి హరీశ్‌రావును పంపించాలని.. అదే సమయంలో తన అన్న అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసిందన్నారు. తన అన్నను ఏదో ఒక కేసులో జైలుకు పంపాలని ప్లాన్ చేసిందని ఆరోపించారు. పార్టీ సర్వనాశనం కావడానికి కవితే కారణమన్నారు. తాను నీలాగా అబద్ధాలు చెప్పేవాడిని కాదన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతి పరులని ఆరోపించే ముందు నీ అవినీతి గురించి ఆలోచించుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవని హెచ్చరించారు.
తాజా వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఎమ్మెల్యేల మాటలు రాజకీయ నాయకుల ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది కవిత రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసి, పార్టీల మధ్య సంబంధాలను మరింత చెడుగా మార్చవచ్చు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు గానీ, జాగృతి నేతలు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎమ్మెల్సీ కవితను కుక్కతో పోల్చిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే
“నీ గురించి చెప్పితే తల ఎక్కడ పెట్టుకుంటావో తెలియదు.
బట్టల షాపులు, బంగారు షాపులను ఎవర్ని వదలకుండా దోచుకున్నావు… నువ్వునన్ను విమర్శిస్తావా?
నీ అత్తగారి ఊర్లో గెలవడం చేతకాని నీవు మాపై మాట్లాడుతావా?” అంటూ మండిపడ్డ మాధవరం… pic.twitter.com/19NaqSPMhq
— greatandhra (@greatandhranews) December 9, 2025