Bigg Boss 9 Eliminations: ఊహించని ట్విస్టులు , ఎమోషన్స్ తో ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ఎట్టకేలకు 13 వారాలు పూర్తి చేసుకొని 14వ వారం లోకి అడుగుపెట్టింది. ఇన్ని వారాలు ఉత్కంఠ భరితంగా సాగింది కదా, చివరి ఈ రెండు వారాలు అయినా కంటెస్టెంట్స్ ని ప్రశాంతంగా ఉంచుతారేమో బిగ్ బాస్ అని అంతా అనుకున్నారు. కానీ ఈ రెండు వారాలు కూడా ఆడియన్స్ కి ఉత్కంఠ తో నరాలు తెగిపోయే రేంజ్ టాస్కులు డిజైన్ చేశారు బిగ్ బాస్ టీం. నిన్న నామినేషన్స్ ప్రక్రియ లాంటివి ఏమి లేకుండా, బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ ని మినహా, మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ నామినేట్ చేసాడు. ఇప్పుడు నామినేషన్స్ లో ఇమ్మానుయేల్, తనూజ, భరణి, డిమోన్ పవన్, సంజన మరియు సుమన్ శెట్టి ఉన్నారు.
వీరిలో ఈ వారం ఆడుతున్న టాస్కులలో ఎవరికైతే అత్యధిక పాయింట్స్ వస్తాయో, వాళ్ళు నేరుగా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి, ఫినాలే వీక్ లోకి అడుగుపెడతారు. అదే విధంగా ఎవరికైతే తక్కువ పాయింట్స్ వస్తాయో, వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. దమ్ము శ్రీజా ఎలిమినేషన్ మీ అందరికీ గుర్తుంది కదా, అదే తరహా ఎలిమినేషన్ ఈ వారం కూడా జరగబోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్కులో ఇమ్మానుయేల్ గెలిచి 50 పాయింట్స్ సాధించాడు. ఆ తర్వాత భరణి 40 పాయింట్స్ సాధించి రెండవ స్థానం లో ఉండగా, డిమోన్ పవన్ 30 పాయింట్లు, తనూజ 20 పాయింట్లు , సుమన్ శెట్టి 10 పాయింట్స్ సాధించారు. ఇక సంజన కి కంటెస్టెంట్స్ అందరూ జీరో పాయింట్స్ ఇచ్చి జైలు లో వేయడం వల్ల ఆమె మొదటి టాస్కులో ఆడలేకపోయింది. ఇక రెండవ టాస్కు ని కాసేపటి క్రితమే మీరు ప్రోమో లో చూసి ఉంటారు.
ఈ టాస్క్ లో కూడా ఇమ్మానుయేల్ గెలిచి 100 పాయింట్స్ సాధించాడు. మొదటి రెండు టాస్కులు కలిపి 150 పాయింట్స్ ని ఇమ్మానుయేల్ సాధించి నెంబర్ 1 స్థానం లో కొనసాగగా, రెండవ స్థానం లో 120 పాయింట్స్ తో డిమోన్ పవన్, ఇక 90 పాయింట్స్ లో తనూజ, భరణి, సుమన్ శెట్టి మూడవ స్థానం లో 80 పాయింట్స్ తో సంజన నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు. వీరిలో ప్రస్తుతానికి సంజన డేంజర్ జోన్ లో ఉంది. ఆమె ప్రతీ టాస్క్ గెలుస్తూ రావాలి, లేదంటే అందరికంటే తక్కువ పాయింట్స్ ఈమెకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈమె ఎలిమినేట్ అవ్వొచ్చు. ఇక ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అయితే సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈయన కూడా వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వొచ్చు. కాబట్టి ఈ వారం ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ టెన్షన్ తోనే ఉండాలి.