KTR: దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు.. కొండా సురేఖ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన కేటీఆర్..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మూడు రోజుల క్రితం కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు. ఒకవైపు బీఆర్‌ఎస్‌ నేతలు, మరోవైపు సినిమా ఇండస్ట్రీ మంత్రిపై ట్వీట్లతో ఎదురు దాడి చేస్తోంది. మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్‌ తొలిసారి స్పందించారు.

Written By: Raj Shekar, Updated On : October 5, 2024 6:31 pm

KTR

Follow us on

KTR: తెలంగాణ దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను ఇటీవల సోషల్‌ మీడియాలో కొందరుట్రోల్‌ చేశారు. దీనిపై మంత్రి భావేద్వేగానికి లోనయా‍్యరు. కన్నీరు పెట్టుకున్నారు. బీసీ అయిన తనను కావాలనే ట్రోల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ట్రోలింగ్‌ను మాజీ మంత్రి, హరీశ్‌రావు కూడా ఖండించారు. కాంగ్రెస్‌నేతలు అయితే రోడ్లెక్కి ఆందోళన చేశారు. ఈ ట్రోలింగ్‌ వెనుక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఉన్నాడని ఆయనను ఆడ్డుకునే యత్నం చేశారు. దీంతో కొండా సురేఖపై సర్వత్రా సానుభూతి వ్యక్తమైంది. అయితే ఇంతలో సానుభూతి మరింతగా పెంచుకునేందుకు, కేటీఆర్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ చసేందుకు కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంమంత-నాగచైనత్య విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌ కరణమని, పలువురు హీరోయిన్లకు డ్రగ్స్‌ అలవాటు చేశాడని ఆరోపించారు. చాలా మంది కేటీఆర్‌ కారణంగా ఇండసస్ట్రీని వదిలి పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు బూమరాంగ్‌ అయ్యాయి. రాజకీయ వివాదంలోకి సినీ ఇండస్ట్రీని లాగడంతో ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత, నాగచైతన్య, నాగార్జున, అమలతోపాటు అనేక మంది హీరో, హీరోయిన్లు స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఇండస్ట్రీని రాజకీయాల కోసం వాడుకోవద్దని సూచించారు. ఇక నాగార్జున అయితే పరువు నష్టం దావా వేశారు. అమల రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీకి ట్వీట్‌ చేశారు.

తొలిసారి కేటీఆర్‌ స్పందన..
సినిమా ఇండస్ట్రీ నుంచి కొండా సురేఖపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్పందించారు. సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాటా‍్లడుతున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఇప్పటికే పరువునష‍్టం దావా వేశానని తెలిపారు.సీఎం రేవంత్‌రెడ్డిపైనా పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. మూసీ ప్రక్షాళనపైనా స్పందిస్తూ మూసీ సుందరీకరణ కన్నా ముందుగా కాంగ్రెస్‌ నేతల నోళ్లు శుద్ధి చేసుకోవాలని సూచించారు.

రాహుల్‌, ​ప్రియాంక ఆగ్రహం..
ఇదిలా ఉంటే కొండా సురేఖ వ్యాఖలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ప్రియాంక గాంధీ అక్కినేని అమలకు ఫోన్‌ చేసి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. తర్వాత సీఎంకు ఫోన్‌ చేసి కొండా సురేఖపై చర్య తీసుకోవాలని సూచించారు. మంత్రి పదవి నుంచి తప్పించాలని సూచించినట్లు సమాచారం. ఆమె స్థానంలో అదే సమాజికవర్గానికి చెందిన మహిళకే మంత్రి పదవి ఇచ్చి పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగకుండా చూసుకోవాలన్నారు. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించవచ్చన్న చర్చ జరుగుతోంది.