https://oktelugu.com/

Vijay: బాలకృష్ణ సినిమాను విజయ్ రీమేక్ చేయడానికి కారణం ఏంటి..?

ప్రస్తుతం తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. ఇక ఆ సినిమాలను చూడడానికే ప్రేక్షకులు అమితమైన ఇష్టాన్ని చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రతి దర్శకుడు మంచి సినిమాని చేయడానికి చాలా వరకు కృషి చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2024 / 06:35 PM IST

    Vijay(1)

    Follow us on

    Vijay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో బాలయ్య బాబు ఒకరు. ఇండస్ట్రీలో ఉన్న నలుగురు స్టార్ హీరోల్లో బాలయ్య బాబు కూడా ఒకరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. అందుకే బాలయ్య బాబు అంటే ప్రేక్షకుడిలో అమితమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బాలయ్య బాబు తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా పొట్రే చేసుకోవడానికి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇక గత సంవత్సరం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘భగవంత్ కేసరి ‘ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా చేసినందుకు బాలయ్య బాబుకు మంచి ప్రశంసలు దక్కడమే కాకుండా తన ఏజ్ కు తగ్గ పాత్రను చేసినందుకు బాలయ్య బాబును చాలామంది విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇక ఇదిలా ఉంటే తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ ప్రస్తుతం సినిమా కెరియర్ కి గుడ్ బై చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఆయన చేస్తున్న చివరి సినిమా కోసం బాలయ్య బాబు సక్సెస్ ఫుల్ సినిమా అయిన భగవంత్ కేసరి మూవీని రీమేక్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    అయితే ఈ సినిమాని అఫీషియల్ గా రీమేక్ చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరమీదకి తీసుకురావాలని ఉద్దేశ్యంలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమానే ఆయన తన చివరి సినిమాగా ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమాలో హీరో తన కోసం కాకుండా తన పక్క వాళ్ళ కోసం పోరాడుతూ ఉంటాడు.

    ఇక తన కూతురు సమానురాలు అయిన అమ్మాయిని ఆర్మీకి పంపించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి విజయ్ ఈ సినిమాని తన చివరి సినిమాగా ఎంచుకుంటే ప్రేక్షకుడిలో విజయ్ మీద కూడా చాలా మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుందని తను రాజకీయ రంగానికి వెళ్లే ముందు ఇలాంటి సినిమా తనకు రాజకీయపరంగా కూడా హెల్ప్ అవుతుందని తన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక అందుకోసమే ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను చేస్తున్నాడు.ఇక అలా కాకుండా హీరోయిన్స్ తో డ్యూయెట్లు పాడడం, లిప్ లాక్ లు ఇవ్వడం లాంటివి చేస్తే రాజకీయంగా ఆయన మీద కూడా చాలా వ్యతిరేకత ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతోనే తన చివరి సినిమాగా ఇలాంటి ఒక డిఫరెంట్ జానర్ లో ఉండే సినిమాని ఎంచుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…