https://oktelugu.com/

Prashanth Neel: రాజమౌళి తో పోటీ పడే రేంజ్ ప్రశాంత్ నీల్ కి ఉందా..? రాబోయే సినిమాలతో ఎవరు పై చేయి సాధించబోతున్నారు..?

ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు, హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దానివల్లే మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని సినిమాలు చేయడానికి కొంత వరకు లేట్ అవుతున్నప్పటికీ, ఆ సినిమాలను మాత్రం ప్రేక్షకులకు చేరవేయడలో వాళ్లు సక్సెస్ అవుతూనే వస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2024 / 06:27 PM IST

    Prashanth Neel

    Follow us on

    Prashanth Neel: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే సౌత్ సినిమా ఇండస్ట్రీ గానే గుర్తింపు సంపాదించుకుంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు మంచి సినిమాలను చేస్తూ విజయాలను దక్కించుకుంటున్నారు. ఇక కనడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశాంత్ నీళ్ళు సైతం కేజిఎఫ్, సలార్ సినిమాలతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఎంచుకున్న పాయింట్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండటం దానికి ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సినిమాలకి ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలకి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ‘జేమ్స్ కామెరూన్’ నుంచి ప్రశంసలు దక్కాయి. కాబట్టి రాజమౌళి స్టాండర్డ్ ఇండియన్ సినిమా స్టాండర్డ్ ని దాటిపోయింది. ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ లోనే ఆయన ఆలోచిస్తున్నాడు. అందుకోసమని ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా భారీ రికార్డులను కూడా కొల్లగొడుతుందనే విధంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ సినిమాతో భారీ సక్సెస్ సాధించాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. ఈ సినిమా 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    అయితే ఈ సినిమాకి రాజమౌళి చేయబోయే సినిమాకి మధ్య పోటీని పెడుతూ కొంతమంది సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. మరి రాజమౌళికి, ప్రశాంత్ నీల్ కి మధ్య పోటీ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికైతే రాజమౌళితో పోటీపడే స్టాండర్డ్ అయితే ప్రశాంత్ నీల్ కి లేదు.

    కాబట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకి రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకి మధ్య పోటీ అనేది ఏ మాత్రం కనిపించడం లేదు. ఇక ఇద్దరు కూడా పాన్ ఇండియాలో తమను తాను ప్రూవ్ చేసుకున్న దర్శకులు కావడం విశేషం.

    మరి ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి అదిరిపోయే సక్సెస్ ను ఇస్తాడా? రాజమౌళి మహేష్ బాబుకి తన కెరీర్ లోనే గుర్తుండిపోయే మెమొరబుల్ సక్సెస్ ని ఇస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇద్దరు దర్శకులు, ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించిన వాళ్లే కావడం విశేషం…