https://oktelugu.com/

KTR  : ఓ రామన్నా.. ఆ నవ్వులు లేవన్నా.. రేవంత్ ఎత్తుకుపోయిండు మరీ

 ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఏ చిన్న సంఘటన జరిగినా సంచలనంగా మారుతోంది. ప్రధాన మీడియా కూడా దానిని ప్రముఖంగా ప్రసారం చేయాల్సి వస్తోంది. దీంతో ఆ విషయం ఒక్కసారిగా చర్చకు దారితీస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 19, 2024 / 07:10 PM IST

    KTR

    Follow us on

    KTR : గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమిపాలైంది. 39 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైపోయింది. కామారెడ్డి, గజ్వేల్ స్థానాలలో పోటీ చేసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. కామారెడ్డి లో ఓటమిపాలయ్యారు. ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. ఆస్థానంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయగా.. ఆయన కూడా ఓటమిపాలయ్యారు. ఇక కేటీఆర్ సిరిసిల్ల స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏవైనా లోటుపాట్లు చోటు చేసుకుంటే.. పూర్తి ఆధారాలతో ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలకు నిత్యం టచ్ లో ఉంటున్నారు. సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో వీలు చిక్కినప్పుడల్లా పర్యటిస్తున్నారు. అధికార, అనధికార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

    ఇటీవల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలలో కేటీఆర్ పాల్గొన్నారు. గౌడ సంఘం ప్రతినిధులతో కలిసి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుచేసిన వేదిక నుంచి కిందికి దిగివస్తుండగా కొంతమంది గౌడ సంఘం ప్రతినిధులు కేటీఆర్ ను కలిశారు. ఇందులో ఒక వ్యక్తి.. కేటీఆర్ ను చూడగానే ఒక పాట అందుకున్నాడు..” అన్నా రామన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా.. నా పింఛన్ రాట్లేదన్నా” అని పాట అందుకున్నాడు. అతడు పాడుతున్న తీరు చూసి కేటీఆర్ కూడా గట్టిగా నవ్వారు. ” నీ పింఛన్ రేవంత్ రెడ్డి ఎత్తుకుపోయిండు” అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి కేటీఆర్ తో కలిసి ఫోటో దిగాడు. కేటీఆర్ కూడా ఆ వ్యక్తితో ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ దృశ్యాలను కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త చర్చకు దారి తీసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ” రామన్న ఎప్పటికీ కార్యకర్తలతో ఉంటాడు. కార్యకర్తలతో సరదాగా సంభాషిస్తుంటాడు. ఈ వీడియో కూడా అలానే ఉంది. ఆ వ్యక్తి పాట పాడటంతో రామన్న కూడా ఒక్కసారిగా నవ్వాడు. ఆయనకు సరైన రిప్లై ఇచ్చాడు.. మొత్తానికి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు అనిపించుకున్నాడని” భారత రాష్ట్ర సమితి నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.