Komati Reddy's key Comments in the Assembly
Komatireddy Venkata Reddy : తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ.. ఈ రాష్ట్రంలో రెండు పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయం సాధించింది. కెసిఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు.. కొంతమంది కాంగ్రెస్, టిడిపి కి చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకున్నారు. శాసనసభ వేదికగా విలీన ప్రకటన చేయించారు. దీనిని నాటి రోజుల్లో కేసీఆర్ తెలంగాణ పునరేకికరణ గా అభివర్ణించారు. మొదటిసారి గెలిచినప్పుడు కేసీఆర్.. ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లారు. అప్పటి ఎన్నికల్లో మునుపటి ఎన్నికల కంటే ఎక్కువ సీట్లను కెసిఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి గెలుచుకుంది. ఆ తర్వాత 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమిపాలైంది. తెలంగాణ రాష్ట్రంలో గెలిచి.. హ్యాట్రిక్ సాధించి.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మరో విధంగా తీర్పు ఇచ్చారు.
Also Read : నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో.. కేటీఆర్ పై కేసు నమోదు.. ఎందుకంటే….
అసెంబ్లీలో కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పై కాంగ్రెస్ నాయకులు.. ఏడాదిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫై భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.” తెలంగాణ రాష్ట్రంలో మీరు 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అందరం పాల్గొన్నాం. అందరం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 10 సంవత్సరాలు మీరు అధికారాన్ని అనుభవించారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. మేం కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది మీరే. అంతిమంగా ముఖ్యమంత్రి అయ్యేది కూడా కేటీఆరే” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఒకరకంగా.. భారత రాష్ట్ర సమితి నాయకులు మరొకరకంగా మాట్లాడుతున్నారు. అంతిమంగా మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఐతే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తెలంగాణలో అధికారంలోకి రాదని.. తెలంగాణకు ఏం చేశారని ప్రజలు కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భారత రాష్ట్ర సమితి కట్టుబడి ఉందని వారు పేర్కొంటున్నారు.
Also Read : SLBC ప్రమాదానికి ఆ జలపాతమే కారణమా?
మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు
తర్వాత మేము పదేళ్లు అధికారంలో ఉంటాం
తర్వాత కేటీఆర్ నువ్వే ఎలాగైనా సీఎం అవుతావు – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి pic.twitter.com/tbFB3Pn9av
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2025