https://oktelugu.com/

Telangana Student dies In US : అమెరికా కాల్పుల్లో తెలంగాణ యువకుడి విషాదంతం.. ఏం జరిగిందంటే

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ భారతీయుల మరణ మృదంగం మళ్లీ మొదలైంది. ఇటీవలే ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. తాజాగా మరో యువకుడి దుండగుల కాల్పులకు బలయ్యాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 30, 2024 / 03:34 PM IST

    Telangana Student dies In US

    Follow us on

    Telangana Student dies In US :  అమెరికాల్లో చదివే విద్యార్థుల్లో భారతీయులే నంబర్ వన్‌ అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇటీవలే అగ్రస్థానానికి చేరుకున్నారు. కానీ, అమెరికాలో మరణిస్తున్న విద్యార్థుల్లోనూ భారతీయులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నెలకు కనీసం ముగ్గురు నలుగురు మృత్యువాత పడుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటుండుగా, మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందుతున్నారు. కొందరు అమెరికాలోని దుండగుల దాడుల్లో హతమవుతున్నారు. తాజాగా అమెరికాలో కాల్పుల ఘటనకు తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగోలోని షాపింగ్‌ మాల్‌లోకి చొచబడిన దుండగులు జరిపిన దాడుల్లో అక్కడే పని చేస్తున్న సాయితేజ ప్రాణాలు కోల్పోయాడు.

    గన్‌ కల్చర్‌కారణంగానే..
    అమెరికాలో విపరీతమైన గన్‌ కల్చర్‌ ఉంది. ఇటీవల భారతీయ విద్యార్థి కూడా అమెరికాలో తుపాకీ కొనుగోలు చేశాడు. పుట్టిన రోజు దానిని శుభ్రం చేస్తుండగా, మిస్‌ఫైర్‌ అయి మృతిచెందాడు. ఇక అమెరికన్లు అయితే చేతిలో తుపాకీ ఉంటే.,. ఇష్టానుసారం కాల్పులు జరుపుతున్నారు. గతంలో జరిపిన కాల్పుల్లో సాధారణ పౌరులతోపాటు, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం తూటాలకు బలయ్యారు. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

    చదువుకునేందుకు వెళ్లి..
    ఖమ్మం రూరల్‌ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయితేజ(26) అమెరికాలో చదువుకుంటున్నాడు. పై చదువుల కోసం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. చికాగోలోని ఓ సాపింగ్‌ మాల్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తూ.. చదువుకుంటున్నాడు. శనివారం తెల్లవారుజామున కొంతమంది దుండగులు మాల్లోకి దూసుకొచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న సాయితేజపై కాల్పులు జరిపారు. అనంతరం దుకాణంలోని నదగు ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో సాయితేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    నాలుగు రోజుల క్రితం కూడా..
    నాలుగు రోజుల క్రితం కూడా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. ఓ స్టోర్‌లో దోపిడీకి యత్నించిన యువకుడు గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మైనాంక్‌ పటేల్‌ ప్రాణాలు కోల్పోయాడు. నార్త్‌ కరోలినాలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో గాయపడిన పటేల్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. స్టోర్‌లో దోపిడీ కోసమే పటేల్‌పై కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా పటేల్‌ భార్య గర్బిణి. వారికి ఐదేళ్ల కూతురు ఉన్నారు.