Forgot your mobile app passwords: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజీతో ఉంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు తమ విధుల కారణంగా ఒత్తిడిగా ఫీలవుతున్నారు. దీంతో కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. వీటిలో Passwords కూడా ఉంటున్నాయి. చాలా మంది జీమెయిన్, మొబైల్, ఇతర యాప్ లకు సంబంధించిన పాస్ వర్డ్ లను అప్పటికప్పుడు క్రియేట్ చేస్తారు. కానీ వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఎంత ప్రయత్నంచినా సాధ్యం కాదు. అయితే ఒక పేపర్ పై రాసుకోవాలని అనుకుంటే ఎవరికైనా తెలిసిపోతుంది. అందువల్ల ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటారు. అయితే ఈ చిన్న ట్రిక్ ద్వారా ఎన్ని పాస్ వర్డులు ఉన్నా.. తెలుసుకోవచ్చు. ఎన్నిసార్లు మార్చినా కూడా తెలిసిపోతుంది. ఇంతకీ ఎలాగో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పని మొబైల్ తోనే సాగుతుంది. సమస్త సమాచారం అంతా ఫోన్ లోనే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన సమాచారాలు మొబైల్ లో ఉండడం వల్ల ఇతరులకు తెలిసిపోతుంది. దీంతో జీమెయిల్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే గూగుల్ డ్రైవ్ లోనూ కొన్ని డాక్యుమెంట్లు సేవ్ చేసుకుంటారు. అయితే అన్ని భద్రపరిచే జీమెయిల్ పాస్ వర్డ్ ను ఒక్కోసారి మరచిపోతుంటారు. మనీ ట్రాన్స్ ఫర్ కోసం వివిధ యాప్ లు ఇన్ స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అత్యవసర సమయాల్లో వీటి పాస్ వర్డ్ లు మరిచిపోతే ఇబ్బంది అవుతుంది. అయితే ఇలాంటి సమయాల్లో ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. వీటికి సంబంధించిన పాస్ వర్డ్ లు అన్నీ మొబైల్ లోనే ఉంటాయి.
జీమెయిల్, వివిద యాప్ లకు సంబంధించిన పాస్ వర్డ్ లు తెలుసుకోవాలంటే.. ముందుగా మొబైల్ లోని Settingsలోకి వెళ్లండి. ఆ తరువాత Google అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత Password Managerపై క్లిక్ చేయాలి. దీంతో మొబైల్ లో ఎలాంటి యాప్ లు ఉపయోగిస్తున్నారో.. అవన్నీ డిస్ ప్లే అవుతాయి. వీటిలో కావాల్సిన యాప్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు యాప్ కు సంబంధించిన పాస్ వర్డ్ లు ఓపెన్ అవుతాయి. ఇవి హైడ్ లో ఉంటాయి ఐ ఐకాన్ పై క్లిక్ చేయడంతో పాస్ వర్డ్ కనిపిస్తుంది. దీంతో ఆ పాస్ వర్డ్ ఏదో తెలుసుకోవచ్చు.
అయితే ఇలా మొబైల్ పాస్ వర్డ్ ను వేరే వాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది. అందువల్ల మొబైల్ కు స్క్రీన్ లాక్ లేదా థంబ్ లాక్ వేసుకోవాలి. ఇది కేవలం మొబైల్ యూజ్ చేసేవారు పాస్ వర్డ్ మరిచిపోతే తెలుసుకునేందుకు. అందువల్ల మొబైల్ ఇతరులకు ఇచ్చే ముందు జాగ్రత్త పడాలి. అలాగే ముఖ్యమైన యాప్ లకు సంబంధించి స్ట్రాంగ్ పాస్ వర్డ్ కేటాయించుకోవాలి. ఒకవేళ మొబైల్ ను ఎవరైనా అడిగితే వారికి కావాల్సిన సమాచారం ఏదో అడిగి వారికి తెలియజేస్తే సరిపోతుంది. అంతేగానీ గుర్తు తెలియని వ్యక్తులకు మొబైల్ ఇచ్చి ఆ తరువాత ఇబ్బందులకు గురికావొద్దు.