Khairatabad Ganesh: హైదరాబాద్ పేరు చెబితేనే చాలు అందుతో ‘ఖైరతాబాద్’ గణేషుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతీ ఏటా గణేష్ ఉత్సవాల కోసం ఖైరతాబాద్ గణేషుడిని భారీగా నిర్మిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అతి ఎత్తైన గణేషుడిని తీర్చిదిద్దుతారు. కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ హితం పేరిట హాని కలిగించే పీవోపీతో గణేషుడిని తయారు చేయవద్దని డిమాండ్లు వచ్చాయి. అందుకే ఈసారి పీఓపీకి బదులుగా మట్టి గణపతినే తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మట్టి గణపతినే రెడీ చేస్తున్నారు.

ఖైరతాబాద్ లో ఈసారి కూడా మట్టి గణపతినే పూజలందుకోబోతున్నాడు. 1954లో ప్రారంభమైన బడా గణేష్ ప్రస్థానం 68 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకూ పీవోపీ ద్వారా వైవిధ్యభరితమైన రూపాల్లో గణపతిని ఖైరతాబాద్ లో ప్రతిష్టించారు.
Also Read: Next CJI Justice Lalit: కాబోయే ప్రధాన న్యాయమూర్తి లలిత్.. ఆయన చెప్పిన సంచలన తీర్పులు ఏవో తెలుసా..?
కానీ ఈసారి ఖైరతాబాద్ గణేషుడి చరిత్రలోనే మొదటిసారిగా మట్టితోనే విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన పద్ధతులలో రూపొందిస్తే విగ్రహం పింగాణిలా మారుతుందని శిల్పి రాజేంద్రన్ వెల్లడించారు.

మట్టి విగ్రహాలనే వాడాలని గత ఏడాది ఉత్సవాల సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఉత్సవ కమిటీ గుర్తు చేసింది. మట్టి విగ్రహం ఎత్తు 50 అడుగుల మేర ఉంటుందని వెల్లడించింది.
Also Read:Palle Raghunatha Reddy: బిగ్ స్క్రీన్ పై ఏపీ నేతలు.. వెండితెరపైకి మరో మాజీ మంత్రి