Pokiri Re- Release: మహేష్ పోకిరి సినిమా క్రియేట్ చేసిన సంచలన రికార్డుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రిన్స్ మహేష్ ను ఈ చిత్రమే సూపర్ స్టార్ ను చేసింది. అయితే.. తాజాగా పోకిరి సినిమాను మళ్లీ రిలీజ్ చేయడానికి ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ పుట్టినరోజు ఆగష్టు 9వ తేదీన ఈ చిత్రాన్ని సెకండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రిలీజ్ కి గానూ వచ్చిన కలెక్షన్స్ ను అన్నీ పిల్లల ఆపరేషన్స్ కోసం ఊపయోగించనున్నారు.
ఏది ఏమైనా మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మాత్రమే కాదు, అంతకు మించి. అసలు మహేష్ అంటేనే.. ఉత్సాహంతో ఉరకలు వేయించే సాహసం. మహేష్ కనిపిస్తే చాలు, ఫ్యాన్స్ ఊగిపోతారు, మహేష్ కోసం ఎంతదూరమైనా సాగిపోతారు. తమ హీరో కోసం పాలాభిషేకాలు చేసిన ఫ్యాన్స్ ను చూశాం. కానీ, ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడే ఫ్యాన్స్ ను, ఒక్క మహేష్ అభిమానుల్లోనే చూడగలం. కాబట్టి పోకిరి రీరిలీజ్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టే ఛాన్స్ ఉంది.
Also Read: Allu Arjun New House: అల్లు అర్జున్ 100 కోట్ల ఇల్లును చూశారా..? వైరల్ ఫొటోలు
.మళ్లీ మహేష్ దయ వల్ల వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్‌లు జరగనున్నాయి. అయినా ఇది మహేష్ కి ఇది కొత్త కాదు. గతంలో ఎందరికో మహేష్ ఇలా ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడాడు. పైగా ప్రతి ఏడాది మహేష్ వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తునే ఉన్నాడు. అసలు మహేష్, చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించడానికి కారణం గతంలో చెప్పాడు.
బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న మహేష్ తన సేవకు కారణం వివరించాడు.
ఇంతకీ మహేష్ ఏమి చెప్పాడంటే.. ‘తన కుమారుడు గౌతమ్ గురించి చెబుతూ మహేష్ ఎమోషనల్ అయ్యాడు. గౌతమ్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు. నా చేయి అంతే ఉన్నాడు. అప్పుడు మాకు డబ్బులు ఉన్నాయి, కాబట్టి సరిపోయింది. మరి డబ్బులు లేని వారి పరిస్థితి ఏమిటి ? అందుకే.. అప్పటి నుంచి చిన్నారుల కోసం ఏదైనా చేయాలని అనిపించింది.
అన్నట్టు మహేష్ గతంలో ‘బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని బుర్రిపాలెం, మరియు సిద్దాపురం అనే రెండు గ్రామాలను మహేష్ దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామాల్లో మహేష్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. ఇంకా చేపడుతూనే ఉన్నాడు.
వైద్యో నారాయణో హరీ అన్నారు పెద్దలు. వైద్యుడిని దేవుడితో సమానం అని పోల్చి చెప్పిన పెద్దలు, వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ మహేష్ లాంటి కొంతమంది దేవుళ్ళలానే సేవలు చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా కరోనా బారిన పడి అల్లాడిపోతోన్న వారికి భరోసాగా నిలిచాడు మహేష్. ఎందర్నో ఆదుకున్నాడు. ఇప్పుడు మహేష్ అభిమానులు కూడా మహేష్ ను ఫాలో కావడం గ్రేట్.
Also Read:Charmy Kaur: ప్రేమ పేరు తో ఛార్మిని నమ్మించి మోసం చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు