KCR Navagraha Yagam : ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో వేద పండితుల సమక్షంలో నవగ్రహ మహాయాగం నిర్వహించారు . సతీమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు పాల్గొంటున్నారు. ఈ యాగం అనంతరం ఈనెల 11న పార్టీ నేతలతో కేసిఆర్ సమావేశం అవుతారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన పార్టీ నాయకులకు సందేశాలు పంపారని తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్రపతి తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. ఊహించని ఓటమితో ఇబ్బంది పడుతోంది. రాజకీయంగా కూడా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ యాక్టివ్ కావాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే కెసిఆర్ పార్టీని మళ్లీ గాడీలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన రాజకీయాలలో తనదైన చాణక్యం ప్రదర్శించాలని భావిస్తున్నారు..”రాజకీయాలలో మళ్ళీ బలంగా మారదాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిద్దాం. పోయిన అధికారాన్ని తెచ్చుకుందామని” ఇటీవల కెసిఆర్ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో అన్నారు.
ఒక్క సీట్ కూడా రాలేదు
ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఒక్క సీట్ కూడా రాలేదు. స్వయంగా కేసీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించారు.. ఆ సమయంలో కవిత ఢిల్లీ జైల్లో ఉన్నారు. కెసిఆర్ కు ఆరోగ్యం కూడా సహకరించలేదు. అయినప్పటికీ పార్టీని బతికించుకోవాలనే ఉద్దేశంతో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీని కూడా వదిలిపెట్టలేదు. అయినప్పటికీ ఆయన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మలేదు. చివరికి కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ లో కూడా భారత రాష్ట్ర సమితి గెలవలేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.
పార్టీని మళ్ళీ బలోపేతం చేసేందుకు..
పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకే కెసిఆర్ ఈ యాగం నిర్వహించినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున.. ఉన్న కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ యాగం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ త్యాగం నిర్వహణను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.. మరోవైపు ఈ యాగం తర్వాత రైతు రుణమాఫీని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రతి జిల్లాల్లోనూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 18 నుంచి కేసీఆర్ ఆయా జిల్లాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది. వీటన్నిటి ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కేసిఆర్ భావిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kcrs navgraha yagam to strengthen the party again is now a tough time for revanth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com