Homeలైఫ్ స్టైల్Dogs : కుక్కలకు ఈ రంగు అంటే ఇష్టం ఉండదట.. ఆ డ్రెస్ వేసుకొని వెళితే...

Dogs : కుక్కలకు ఈ రంగు అంటే ఇష్టం ఉండదట.. ఆ డ్రెస్ వేసుకొని వెళితే మీ పని ఖతమే?

Dogs :  కుక్కలకు, మనుషులతో మంచి సంబంధం ఉంటుంది. మనుషులు కూడా పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కలనే పెంచుకుంటారు. ఇవి మనుషులతో వాళ్ల ఫ్యామిలీ మెంబెర్ లా కలిసిపోతాయి. మనుషుల కంటే కుక్కలే విశ్వాసంగా ఉంటాయని అంటుంటారు. వాటికీ ఒక్కసారి మనం ఫుడ్ పెడితే చాలు.. రోజు మన వెంటే ఉంటాయి. ఎలాంటి ఆపద వచ్చిన కాపాడతాయి. కొందరు వీటితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. కుక్కలు కూడా మనుషులకి కనెక్ట్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. వాటికి బాధ వచ్చిన కూడా అవి ఏడుస్తాయి. వాసన పసిగట్టగలవు . కుక్కలని కాపలాకి ఎక్కువగా పెడతారు. ఇంటికి ఎవరూ వచ్చిన, దొంగతనం ఏదయినా జరిగిన వెంటనే పసిగెట్టేస్తాయి. అయితే కుక్కలకి రంగులకు కొంత సంబంధం ఉంది. సాధారణంగా ఎవరికీ అయిన కొన్నింటిని చుస్తే.. కోపం వస్తుందిమా అలాగే కుక్కలకి కూడా కొన్ని రంగులని చుస్తే నచ్చదు. కుక్కలని చూసి ఎవరైనా భయపడతారు. కానీ కుక్కలు మాత్రం కొన్ని రంగులని చూసి భయపడతాయి. అసలు కుక్కలు ఎందుకు రంగులని చూసి.. భయపడతాయి. దీనికి కారణం ఏంటో మరి తెలుసుకుందాం.

సాధారణంగా కుక్కలు ఏవైనా భయపెట్టేవి చుస్తే అరుస్తాయి. వాటి అరుపు కూడా ఆ సమయంలో వేరేగా ఉంటుంది. అయితే కుక్కలకు ఎక్కువగా నీలం రంగు అంటే నచ్చదు. నీలం రంగుని చూసి కుక్కలు భయపడతాయి అని అందరూ అంటున్నారు. కానీ ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు. ఎందుకు అంటే కొన్ని కుక్కలు మాత్రమే నీలం రంగుని చూసి దూరంగా వెళ్లిపోతాయి. మరి కొన్ని కుక్కలు సాధారణంగానే ఉన్నాయి. చాలా మంది కుక్కలని వదిలించుకోవడానికి నీలం రంగు వాటర్ వాడుతారు. కానీ ఇది అన్ని రకాల కుక్కలకు పనిచేయదు. అయితే కొందరు కుక్కలకి కలర్ బ్లైండ్ నెస్ ఉందని అంటారు. కుక్క కేవలం నీలం, పసుపు రంగులని మాత్రమే గుర్తించగలదని నమ్ముతారు. కానీ ఇందులో నిజం ఎంతో ఇప్పటికి తెలియదు.

కొన్ని కుక్కలకు నలుపు రంగు అంటే ఇష్టం ఉండదట. నలుపు రంగుని చుస్తే.. గట్టిగా అరవడం, మోరాయించడం వంటివి చేస్తాయని అంటున్నారు. అయితే ఈ లక్షణాలన్నీ అన్ని కుక్కలకు ఒకేలా ఉండదు. ఒక్కో కుక్క ఒకోలా ఉంటుంది. కొన్ని కుక్కలకి ఎరుపు రంగు అంటే ఇష్టం. కానీ కొన్నిటికి ఎరుపు అసలు నచ్చదు. వాటిని చుస్తే పరిగెత్తుతాయని అంటుంటారు. కొన్ని కుక్కలు కేవలం నీలం, పసుపు రంగులు తప్ప అన్ని రంగులు వేరే కలర్ లో కనిపిస్తాయని అంటుంటారు. ఇంకా వేరే ఏ రంగు చూసిన గోధుమ, పచ్చ వంటివి వాటికి కనిపిస్తాయని అంటారు. అయితే కుక్కలకు ఏ రంగు అంటే ఇష్టం, ఏ రంగు అంటే ఇష్టం లేదు అనే విషయంపై స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular