KCR tapped the phones of the owners of media organizations including ABN RK and BJP leaders!
Phone Tapping : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో ప్రధాన నిందితుడు డీసీపీ రాధాకిషన్‌రావు వాగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) ఫోన్‌ను కేసీఆర్ ట్యాప్ చేయించినట్లు తెలిపాడు. మరో ఛానెల్ యజమాని ఫోన్ కూడా ట్యాప్ చేశామని వెల్లడించాడు. తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌తోపాటు వారి సిబ్బంది ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశామని వాగ్మూలంలో వివరించాడు.
ఎవరినీ వదలకుండా…
కేసీఆర్ తన అధికారం కాపాడుకునేందు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్నే నమ్ముకున్నాడు. ఈ క్రమంలో విపక్ష నేతలును టార్గెట్ చేసి వారి మాటలను రహస్యంగా తెలుసుకోవడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు. గద్వాల, కోరుట్ల, మానకొండూర్‌కు చెందిన విపక్ష నేతలు, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో వెల్లడించారు. బీఆర్‌ఎస్‌తో ఇబ్బంది అనుకున్న అందరినీ కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు.
సొంత పార్టీ నేతల ఫోన్లు?
ఇక కేసీఆర్ విపక్ష నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా టార్గట్ చేశారు. బీఆర్‌ఎస్‌కు ఇబ్బంది అనుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై నిఘా పెట్టారు. కడియం శ్రీహరితో రాజయ్యకు ఉన్న విభేదాలపైనా దృష్టిపెట్టారు. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారి ఫోన్లు ట్యాప్ చేశారు. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లపైనా నిఘా పెట్టారు. ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లు కూడా ట్యాప్ చేశామని రాధాకిషన్‌రావు తన వాగ్మూలంతో వివరించాడు.
మరో మీడియా అధినేత ఎవరు?
మీడియా అధినేతల ఫోన్లపై ప్రత్యేక నిఘా పెట్టించిన కేసీఆర్ ఏబీన్ చీఫ్ రాధాకృస్ణతోపాటు మరో మీడియా సంస్థ అధినేత ఫోన్ కూడా ట్యాప్ చేశారని రాధాకిషన్‌రావు తెలిపారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్‌ను ప్రణీత్‌రావు విశ్లేషించినట్లు తేలింది. నాటి మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ప్రణీత్‌రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి ఓ మీడియా యజమాని వద్దకు వెళ్లినట్లు తేలింది. ఆ మీడియా సంస్థ యజమాని సూచనల మేరకు పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఇక ప్రణీత్‌రావు అక్టోబర్, నవంబర్ నెలల్లో వీఐపీల సమాచారాన్ని సదరు మీడియా యజమాని అందించినట్లు తాజాగా నిర్ధారణ అయింది. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ధన సహాయం చేసేవారిపై నిఘా పెట్టామని రాధాకిషన్‌రావు తెలిపాడు. బీఆర్‌ఎస్‌ను ట్రోల్ చేసేవారిని ప్రణీత్‌రావు టార్గెట్ చేశారని వెల్లడించాడు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Kcr tapped the phones of the owners of media organizations including abn rk and bjp leaders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com