Peddi Hindi Teaser: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) కి సంబంధించిన టీజర్ నేడు శ్రీ రామ నవమి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉప్పెన’ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలై రెండు కీలకమైన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే మూడవ షెడ్యూల్ ఢిల్లీ లో ప్రారంభం కానుంది. ‘గేమ్ చేంజర్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఉరకలు వేస్తూ కనిపించిన రామ్ చరణ్ ఫ్యాన్స్, ఈమధ్య కాలంలో డల్ అయ్యారు. కానీ పెద్ది టీజర్ రాగానే వారిలో వెయ్యి వోల్టుల కరెంటు పాస్ అయ్యింది.
Also Read: ఆ పూజారి కారణంగా బాలయ్య జీవితం రివర్స్ అయ్యిందా? వెలుగులోకి వచ్చిన నిజాలు!
సోషల్ మీడియా లో ఈసారి కుంభస్థలం బద్దలు కొడుతాము అంటూ గర్వంగా ట్వీట్స్ వేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ ఒక్క హిందీ లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. తెలుగు వెర్షన్ టీజర్ ‘వృద్ధి సినిమాస్’ యూట్యూబ్ ఛానల్ లో విడుదల అవ్వగా, కన్నడ వెర్షన్ టీజర్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ యూట్యూబ్ ఛానల్ లో, తమిళ వెర్షన్ టీజర్ ‘రామ్ చరణ్’ యూట్యూబ్ ఛానల్ లో , మలయాళం వెర్షన్ టీజర్ ‘సుకుమార్ రైటింగ్స్'(Sukmar Writings) యూట్యూబ్ ఛానల్ లో విడుదలైంది. కానీ హిందీ టీజర్ పాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. రామ్ చరణ్ కి మంచి క్రేజ్ ఉన్న మర్కెట్స్ లో ఒకటి నార్త్ ఇండియన్ మార్కెట్. ఆయన గత చిత్రం ‘గేమ్ చేంజర్’ అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ, హిందీ లో 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా ఓటీటీ లో కూడా హిందీ వెర్షన్ ‘గేమ్ చేంజర్’ చిత్రం గత నెల రోజుల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది. ఇంతమంచి క్రేజ్ ఉన్న మార్కెట్ లో ‘పెద్ది’ టీజర్ విడుదల అవ్వలేదేంటి, అసలు హిందీ లో రిలీజ్ అవుతుందా లేదా? అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చించుకున్నారు. రామ్ చరణ్ చిత్రం హిందీ లో విడుదల లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి?, డబ్బింగ్ వర్క్ కాస్త పెండింగ్ లో ఉండడం వల్లే ఈరోజు విడుదల కాలేదట. రేపటి నుండి ఈ టీజర్ ‘T సిరీస్'(T-Series) యూట్యూబ్ ఛానల్ లో విడుదల కానుంది. అన్ని వెర్షన్ టీజర్స్ తో పాటు హిందీ వెర్షన్ టీజర్ ని కూడా విడుదల చేసుంటే బాగుండేది అని అభిమానులు అంటున్నారు. హిందీ టీజర్ లో అదనంగా కొన్ని షాట్స్ ని జత చేశారా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.