MLC Kavitha: కవితకు వచ్చింది అగ్రిమెంట్‌ బెయిలేనా? ఎవరు ఎవరితో ఒప్పందం చేసుకున్నట్లు!

తెలంగాణలో రాజకీయ వేడి ఎన్నటికీ తగ్గేలా కనిపించడం లేదు. సాధారణంగా ఎన్నికల వరకే ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతాయి. రాజకీయ వేడి ఉంటుంది. కానీ తెలంగాణలో ఏడాది కాలంగా అరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడి కొనసాగుతోంది.

Written By: Raj Shekar, Updated On : August 28, 2024 11:51 am

MLC Kavitha

Follow us on

MLC Kavitha: తెలంగాణలో ఏడాది కాలంగా రాజకీయ పార్టీల మధ్య యుద్ధం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలతో యుద్ధం ఆగుతుందని అంతా భావించారు. కానీ, ఎన్నికల తర్వాత మరింత పెరిగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడా తగ్గడం లేదు. నువ్వు ఒకటి అంటే.. నేను నాలుగు అంటా అన్నట్లు మాటల తూటాలు పేలుస్తున్నారు. కొద్ది రోజులుగా వివిధ అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయాలు తిరుగుతుతున్నాయి. తాజాగా ఇప్పుడు అన్ని పార్టీలు కవిత బెయిల్‌ వైపు టర్న్‌ అయ్యాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు చేయడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్నీ ఈ అంశం ఆధారంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. కవితకు బెయిల్‌ దక్కడం బీఆర్‌ఎస్‌ – బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. మరోవైపు కవితకు బెయిల్‌ కాంగ్రెస్‌ కృషి అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు..

స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం..
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – బీఆర్‌ఎస్‌ మధ్య అంతరంగిక ఒప్పందం కుదిరిందంటూ లిక్కర్‌ స్కామ్‌ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్‌ ఆ విషయంలో సక్సెస్‌ అయింది. తాజాగా కవిత బెయిల్‌కు బీజేపీ సహకారం అందించిందని దీనిని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలనుకుంటోంది. అదే సమయంలో గత కొన్నాళ్ళుగా మీడియాకు, ప్రజలకు దూరంగా ఉంటున్న కేసీఆర్‌.. ఇక గ్రౌండ్‌ లోకి దిగుతారని అంటున్నారు. బీఆర్‌ఎస్‌పై జరుగుతోన్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు కవితకు బెయిల్‌ దక్కిన తర్వాత రంగంలోకి దిగాలని కేసీఆర్‌ ఫిక్స్‌ అయ్యారట. ఈ క్రమంలోనే కేసీఆర్‌ కొద్ది రోజుల్లోనే మీడియా ముందుకు వస్తారని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌ – బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన తన వర్షన్‌ వినిపించనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ కూడా..
ఇక బీజేపీ కూడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. దర్యాప్తు సంస్థలను కేంద్రానికి ఆపాదదించిన నేతలు.. ఇప్పుడు న్యాయస్థానాన్ని కూడా బీజేపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బెయిల్‌ ఇప్పించాలనుకుంటే.. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే వచ్చేందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌తోనే బీఆర్‌ఎస్‌ కుమ్మక్కైందని ఆరోపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలపకపకుండా న్యాయవాది అభిషేక్‌ సింగ్వీ గెలుపునకు బీఆర్‌ఎస్‌ సహకరించిందని ఆరోపిస్తోంది. అందుకే కవితకు అభిషేక్‌ సింగ్వీ బెయిల్‌ వచ్చేలా కృషి చేశారని ఆరోపిస్తోంది. కవిత తరఫున కింది కోర్టులో ఏఐసీసీ నేత అభిషేక్‌ మను సింఘ్వి వాదించారన్నారు. బండి తప్పితే ఏ నేత కూడా కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు సరైన కౌంటర్‌ ఇవ్వలేకపోయారు. దీంతో కవిత బెయిల్‌ అంశం బీజేపీని మళ్లీ డిఫెన్స్‌ లో పడేసినట్లుగా కనిపిస్తోంది.