Nani: ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో ఎదిగిన హీరోల్లో నాని ఒకరు. దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చిన నాని అనూహ్యంగా నటుడు అయ్యాడు. బాపుతో పాటు కొందరు స్టార్ డైరెక్టర్స్ వద్ద నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ నానిని హీరో చేశాడు. అష్టాచెమ్మా టైటిల్ తో నాని హీరోగా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో నానికి ఆఫర్స్ పెరిగాయి.
స్నేహితుడా, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది చిత్రాలు హీరోగా నానికి బ్రేక్ ఇచ్చాయి. దర్శకుడు రాజమౌళితో ఆయన ఈగ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్. నాని పాత్ర పరిమితంగా ఉంటుంది. అయినా ఫేమ్ తెచ్చిపెట్టింది. ఒక్కో సినిమాకు ఎదుగుతూ టైర్ టు హీరోల జాబితాలో టాప్ రేంజ్ కి నాని చేరుకున్నాడు. ఇదంతా ఆయన కృషి, పట్టుదల వలనే సాధ్యమైంది.
నాని డెడికేషన్ కి తాజా సంఘటన ఉదాహరణగా నిలిచింది. నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో తీరిక లేకుండా పాల్గొంటున్నాడు నాని. సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ నాని మూవీని ప్రమోట్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
కాగా సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడట. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారట. దాంతో ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నాని చూస్తున్నాడట. పగలంతా ప్రమోషన్స్, రాత్రి పోస్ట్ ప్రొడక్షన్ లో మునిగిపోతున్నాడట. గత పది రోజులుగా నాని కంటి నిండా నిద్రపోయింది లేదట. సినిమా కోసం నాని పడుతున్న తాపత్రయం చూసి టాలీవుడ్ వర్గాలు విస్తుపోతున్నాయి.
చాలా మంది హీరోలు షూటింగ్ కంప్లీట్ కాగానే మా పని అయిపోయిందని అనుకుంటారు. ఏదో తూతూ మంత్రంగా నిర్మాతలు ఇబ్బంది పెడితే ప్రమోషన్స్ లో పాల్గొంటారు. సినిమా మనది, దాని విజయం కోసం కృషి చేయాలి. మనతో పాటు దర్శకుడు, నిర్మాత ప్రయోజనం పొందాలని ఆలోచించే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. నటించడం వరకే మన బాధ్యత అని భావించే కొందరు హీరోలు నానిని చూసి సిగ్గుపడాలన్న వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కాగా సరిపోదా శనివారం ఆగస్టు 29న విడుదల కానుంది.