https://oktelugu.com/

Stree 2 Collection: 7 ఏళ్ళ ‘బాహుబలి 2’ రికార్డుని దాటేయబోతున్న ‘స్త్రీ 2’..ఇదేమి అరాచకం బాబోయ్!

వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే, 'స్త్రీ 2' ఒకవేళ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడితే అది ఒక చరిత్రనే అవుతుంది. మళ్ళీ ఇలాంటి అరుదైన రికార్డుని నెలకొల్పాలంటే రాజమౌళి సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

Written By:
  • Vicky
  • , Updated On : August 28, 2024 / 11:47 AM IST

    Stree 2 OTT

    Follow us on

    Stree 2 Collection: ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోల సృష్టించిన రికార్డ్స్ ని బద్దలు కొట్టాలంటే, మరో స్టార్ హీరో సినిమాకే సాధ్యపడేది. చిన్న సినిమాల వసూళ్లు స్టార్ హీరోల వసూళ్లకు దరిదాపుల్లో కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. చిన్న సినిమాలు సూపర్ స్టార్స్ రికార్డ్స్ ని అవలీలగా దాటేస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ అందుకు ఉదాహరణ. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ. శ్రద్దా కపూర్ ప్రధాన పాత్ర పోషించింది. కామెడీ + హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండే కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు ఈ చిత్రం మూడవ వారంలోకి అడుగుపెట్టింది, కానీ వసూళ్లు జోరు ఏమాత్రం తగ్గలేదు. మొదటి వారంలోనే ఈ సినిమా ప్రభాస్ కల్కి హిందీ ఫుల్ రన్ వసూళ్లను దాటేసిన ఈ చిత్రం, 13 రోజుల్లో 415 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

    అతి త్వరలోనే ఈ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 (435 కోట్లు) ని దాటేయబోతుంది. ఆ తర్వాత ఈ చిత్రం రణబీర్ కపూర్ ఎనిమల్ (495 కోట్లు), బాహుబలి 2 (511 కోట్లు), సన్నీ డియోల్ గద్దర్ 2 (515 కోట్లు) చిత్రాల వసూళ్లను కూడా దాటనుంది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్న మాట. బాలీవుడ్ చిత్రాలకు బాహుబలి 2 హిందీ వెర్షన్ వసూళ్లను దాటడం పెద్ద సవాలు. కానీ స్త్రీ 2 చిత్రం ఈ వారంలోనే అవలీలగా దాటేయబోతుంది. 7 ఏళ్ళ నుండి స్టార్ హీరోలకు కూడా అతి కష్టంగా మారిన బాహుబలి 2 వసూళ్లను, ఒక చిన్న సినిమా ఇంత సులువుగా దాటేయడం ట్రేడ్ పండితులను విస్మయానికి గురి చేస్తుంది. అంతే కాదు ఫుల్ రన్ లో ఈ సినిమా షారుఖ్ నటించిన పఠాన్ (525 కోట్లు), జవాన్ (565 కోట్లు) వసూళ్లను కూడా దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రెండు చిత్రాల వసూళ్లను కొడితే షారుఖ్ ఖాన్ మాత్రమే కొట్టగలడు, లేకపోతే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కొట్టగలరు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కొట్టబోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు ఒక ప్రాంతీయ భాష చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చరిత్రలో లేదు.

    వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే, ‘స్త్రీ 2’ ఒకవేళ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడితే అది ఒక చరిత్రనే అవుతుంది. మళ్ళీ ఇలాంటి అరుదైన రికార్డుని నెలకొల్పాలంటే రాజమౌళి సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. చూడాలి మరి స్త్రీ 2 ఆ అరుదైన రికార్డుని సాధిస్తుందా లేదా అనేది. మరోపక్క స్త్రీ చిత్రానికి బుక్ మై షో యాప్ లో పని దినాలలో కూడా గంటకి 10 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ రేంజ్ ట్రెండ్ ఉంది కాబట్టి, ఇప్పట్లో ఈ సినిమా రన్ ఆగదని, కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.