Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కూతురు అయిన కల్వకుంట్ల కవిత.. ప్రస్తుతం బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే కేసీఆర్ కూతరును ఎమ్మెల్సీ చేశారు. తర్వాత కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఐదు నెలలు జైల్లో ఉన్నారు. జైలు నుంచి వచ్చాక మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pavan kalyan)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాన్ సీరియస్ పొలిటీషియన్ కాదని పేర్కొన్నారు. ఆయన లక్కీగానే డిప్యూటీ సీఎం అయ్యారని వెల్లడించారు. ఆయన రాజకీయ ఆలోచనలు కూడా స్పష్టంగా ఉండవని, తరచూ తన విధానాలు మార్చుకుంటారని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో లక్ కలిసి రావడంతోనే డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు.
Also Read : రేషన్ లబ్ధిదారులకు షాక్.. సన్న బియ్యం పంపిణీలో ట్విస్ట్
పవన్ కళ్యాణ్ రాజకీయ నేపథ్యం..
జనసేన వ్యవస్థాపకుడిగా పవన్ కళ్యాణ్ 2014 నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కవిత రాజకీయ నేపథ్యం..
కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా, మాజీ ఎంపీగా, తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే, ఇది రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శల భాగంగా లేదా ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాజకీయ చర్చల సందర్భంగా ఉండవచ్చు.
జన సైనికుల మండిపాటు..
కవిత వ్యాఖ్యలపై జనసేన నేతలు, అభిమానలు మండిపడుతున్నారు. కవితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్, రియల్ ఎస్టేట్, మైనింగ్ స్కాం చేసి జైళ్లకు పోయిన వాళ్లే సీరియస్ పొలిటీషియన్లు అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. కవిత ఒపీనియన్ నిజాబాబాద్‌లోనే చెల్లలేదు.. కనీసం పోటీ కూడా చేయలేదు. పోటీ చేసిన అన్ని చోట్ల జనసేన గెలిచింది. అని గుర్తు చేస్తున్నారు.
Also Read : టిడిపి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు.. అక్కడ తారాస్థాయిలో విభేదాలు!
Unfortunately He became a Deputy CM
” @PawanKalyan is not a serious Politician. ”
– BRS MLC,KCR Daughter Kavitha pic.twitter.com/fmpUPdh7H7— RAJIV (@KingRajiv) April 9, 2025