https://oktelugu.com/

KA Paul: కేఏ.పాల్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరీ.. వైరల్‌ వీడియో

పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. స్పీకర్‌ కార్యాలయానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 9, 2024 / 04:42 PM IST

    KA Paul

    Follow us on

    KA Paul: పది నెలల క్రితం జరిగిన తెలంగాణ సెంబ్లీన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు 64 సీట్లు వచ్చాయి. దీంతో రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లాం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో హై కోర్టును కూడా ఆశ్రయించారు. గతనెలలో పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సోమవారం(సెప్టెంబర్‌ 9న) తీర్పు వెల్లడించింది. ఇందులో పార్టీ్ట మారిన ఎమ్మెల్యేలకు షాక్‌ ఇచ్చే తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై కేఏ.పాల్‌ స్పందించారు. తన వాదనలు విన్న తర్వాతనే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెబుతున్నారు. దీనిని సంబందించిన వీడియో వైరల్‌ అవుతోంది.

    సెప్టెంబర్‌ 6న వాదనలు..
    ఈ వీడియోలో.. తాను సెప్టెంబర్‌ 6న(శుక్రవారం) తెలంగాణ హైకోర్టు బెంచ్‌ ముందు తన వాదనలు వినిపించినట్లు చెప్పారు. అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించారు. పార్టీ మారడం చట్ట విరుద్ధమని తాను కోర్టులో వాదనల సందర్భంగా రుజువు చేశానని చెప్పారు. తన వాదనలను ఏకీభవించిన కోర్టు రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేసింది. స్పీకర్‌కు కేవలం నాలుగు వారాల గడువు ఇచ్చిందని తెలిపారు. తాను వాదనలు వినిపించకపోతే.. తీర్పును మూడు నెలలు, మూడేళ్లకు కూడా వెల్లడించకపోయేదని చెప్పుకొచ్చారు.

    మంచి మార్పు కోసం..
    తెలంగాణ సీజేఐ తీర్పు నేపథ్యంలో ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు. పార్టీ మారిని ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫైగా ప్రకటిస్తే వారికి మళ్లీ ఓట్లు వేయొద్దని సూచించారు. ఇందిరాగాంధీనే ప్రజలు తిరస్కరించారని, ఎమ్మెల్యేలు ఎంత అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తమార్పు కోసం అందరూ ప్రే చేయాలని కోరారు. హైకోర్టులో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వాదించానని తెలిపారు. గొప్ప మార్పు కోసం అందరూ కృషి చేయాలని కోరారు.

    స్పందిస్తున్న నెటిజన్లు..
    ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పాల్‌కాక నువ్వు తోపు అని కామెంట్లు పెడుతున్నారు. న్యాయవాదుల వాదనలను కాదని పాల్‌ వాదనలకే కోర్టు ప్రయారిటీ ఇచ్చిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. పాల్‌ తలుచుకుంటే అంతే మరి అని కామెంట్స్‌ పెడుతున్నారు.