Gabbar Singh Re Release: ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ క్లోసింగ్ కలెక్షన్స్.. పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఇలాంటి రికార్డ్స్ సాధ్యం!

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మక రికార్డులను నెలకొల్పింది. అప్పటి వరకు ఉన్న రీ రిలీజ్ ఫుల్ రన్ రికార్డ్స్ ని కేవలం మొదటి రోజు వసూళ్లతోనే బద్దలు కొట్టడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ట్రేడ్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 8 కోట్ల 5 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది.

Written By: Vicky, Updated On : September 9, 2024 4:45 pm
Follow us on

Gabbar Singh Re Release: సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మక రికార్డులను నెలకొల్పింది. అప్పటి వరకు ఉన్న రీ రిలీజ్ ఫుల్ రన్ రికార్డ్స్ ని కేవలం మొదటి రోజు వసూళ్లతోనే బద్దలు కొట్టడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ట్రేడ్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 8 కోట్ల 5 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. ఒకపక్క వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి, అయినప్పటికీ కూడా ‘గబ్బర్ సింగ్’ చిత్రం రీ రిలీజ్ పై ఇసుమంత ప్రభావం కూడా చూపలేదు. ముఖ్యంగా విజయవాడ లో వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అలాంటి ప్రాంతంలో కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడ్డాయి. సింగల్ స్క్రీన్స్ కాకుండా ఈ చిత్రానికి కేవలం మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ మాత్రమే కేటాయించారు. అయినప్పటికీ కూడా హౌస్ ఫుల్స్ పడ్డాయి. కృష్ణా జిల్లా నుండి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఆల్ టైం రికార్డు గా చెప్తుంది ట్రేడ్. అలా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ సినిమా కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. అలా మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే మూడవ రోజు 43 లక్షల రూపాయిలు, మొత్తం మీద ఫుల్ రన్ లో ఈ చిత్రం 9 లక్షల 10 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేయదగ్గ సినిమాలతో ఇలాంటి రికార్డ్స్ పెట్టడం చిన్న విషయం కాదు.

సోమవారం వర్కింగ్ డే అప్పుడు విడుదల అవ్వడంతో లాంగ్ రన్ ఆశించిన స్థాయిలో రాలేదు కానీ, ఒకవేళ వీకెండ్ లో విడుదల అయ్యుంటే కచ్చితంగా ఫుల్ రన్ 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం వల్ల అనేక మెయిన్ సెంటర్స్ లో కావాల్సిన సరైన షోస్ ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి దొరకలేదు, లేదంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 10 కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి గబ్బర్ సింగ్ ఓపెనింగ్ రికార్డ్స్ ని భవిష్యత్తులో ఏ హీరో బద్దలు కొట్టబోతున్నాడు అనేది.