https://oktelugu.com/

KCR – KK : బతిమిలాడిన కేసీఆర్.. వినకుండా కాంగ్రెస్ లోకి కేకే.. అసలేం జరిగింది?

తెలంగాణ ఏర్పాటుకు ముందు కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను కేసీఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేశారని సమాచారం. కేకే ఇచ్చిన సమాచారంతోనే ఆయన అప్పట్లో ఢిల్లీ వెళ్లారని.. తెలంగాణ సాధించిన యోధుడిగా ఢిల్లీ నుంచి వచ్చారని ఇప్పటికి గుసగుసలు వినిపిస్తుంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2024 10:30 pm
    KK-vs-KCR

    KK-vs-KCR

    Follow us on

    KCR – KK : పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఇప్పటివరకు భారత రాష్ట్ర సమితిలో కీలకంగా పనిచేసిన కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేకే దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కేశవరావు భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు కూడా కేకే హాజరు కావడం లేదు. పార్టీ జనరల్ సెక్రటరీగా గతంలో ఉత్సాహంగా కనిపించిన కేకే.. భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన తర్వాత అంటి ముట్టనట్టు ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది..

    కేసీఆర్ అసహనం

    కేకే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ” పదేళ్లపాటు అధికారంలో ఉన్నావు. పార్టీలో జనరల్ సెక్రెటరీ హోదా కల్పించాను. నీ కూతురికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కట్టబెట్టాను. అలాంటప్పుడు పార్టీ అధికారానికి దూరమైనంతమాత్రాన వెళ్లిపోవాలా? ఇది ఎంతవరకు సమంజసం, ఇది సరైన పద్ధతి కాదంటూ” కేసీఆర్ కేకే పై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆయన రేపు మా పో భారత రాష్ట్ర సమితి జనరల్ సెక్రెటరీ పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. కేకే తో పాటు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సమాచారం. వారితో పాటు కొంతమంది హైదరాబాద్ భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

    భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే.. కేకే వ్యవహార శైలి ఒక్కసారి గా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఆయనను కలిశారు. అప్పట్లో ఆమె పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే దానిని ఆమె ఖండించారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల కోసమే ముఖ్యమంత్రిని కలిశానని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కేకేకు అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజులకే కేకే, ఆయన కూతురు.. హస్తం పార్టీలో చేరబోతుండడం విశేషం.

    తెలంగాణ ఏర్పాటుకు ముందు కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను కేసీఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేశారని సమాచారం. కేకే ఇచ్చిన సమాచారంతోనే ఆయన అప్పట్లో ఢిల్లీ వెళ్లారని.. తెలంగాణ సాధించిన యోధుడిగా ఢిల్లీ నుంచి వచ్చారని ఇప్పటికి గుసగుసలు వినిపిస్తుంటాయి. ఎప్పుడైతే తెలంగాణ సాధించిన క్రెడిట్ కెసిఆర్ కు దక్కిందో.. అప్పుడే కేకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని.. భారత రాష్ట్ర సమితిలో చేరారని.. అప్పట్లో కేకే చేసిన సాయానికి గుర్తుగానే పార్టీలో కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని.. రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. పదేళ్లపాటు కేసీఆర్, కేకే మధ్య దృఢమైన బంధం కొనసాగింది. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ బంధానికి బీటలు వారాయి.