Jubilee Hills by-election: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని, హైదరాబాద్‌తో పట్టు సడలలేదని నిరూపించరోవాలని, అధికార కాంగ్రెస్ పాలనలో విఫలమైందని నిరూపించాలని బీఆర్‌ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక అధికార కాంగ్రెస్ తమ పాలను బాగుందని, హైదరాబాద్‌లోనూ బలం పెరిగిందని, నిరూపించకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక బీజేపీ కూడా పట్టుకోసం ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో హైడ్రా ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ప్రచారాస్త్రంగా మారింది. అధికార పార్టీకి ఇదే మైనస్‌గా మారింది. ‘‘హైడ్రా’’ పేరుతో జరుగుతున్న కూల్చివేతలు ఎన్నికల చర్చను పూర్తిగా మలుపు తిప్పాయి.
హైడ్రా ప్రచారాస్త్రం..
రేవంత్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా ఆపరేషన్ కింద అనధికార నిర్మాణాలపై కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్యలు పేదలు, మధ్యతరగతివారిని లక్ష్యంగా చేసుకున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ధనికుల నిర్మాణాలపై చూపు లేకుండా, సామాన్యుల ఇళ్లపైకి బుల్డోజర్లు పపండంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేటీఆర్ ప్రకారం, 15 మంది బిల్డర్ల నిర్మాణాల్లో తప్పులు ఉన్నాయని స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కా అంగీకరించినప్పటికీ చర్యలు లేవు. కానీ అదే సమయంలో, సాధారణ పౌరుల ఇళ్లను కూల్చివేయడం ప్రభుత్వం తారతమ్యం పాటిస్తోందని చెప్పారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నా చర్యలు లేవని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంపై కూడా చర్యలు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోందని పేర్కొన్నారు.
ఒవైసీ నిర్మాణాల ప్రస్తావ..
కేటీఆర్ విమర్శల్లో మరో విభాగం మజ్లిస్ నేతలకూ సంబంధించినది. ఓల్డ్ సిటీలో ఒవైసీ కుటుంబానికి చెందిన కట్టడాలు చెరువుల్లో ఉన్నా అవి హైడ్రా పరిధికి రాలేదని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్–ఎంఐఎం కలిసి పనిచేశాయి. ఇప్పుడు ఎంఐఎం నేతల ఆస్తులను కూల్చకపోవడం ఏంటని నిలదీస్తున్నారు.
Also Read: వరుస బస్సు ప్రమాదాలకు అసలు కారణాలు ఇవి..
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం..
హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం గందరగోళంలో పడిందని, పెట్టుబడిదారులు వెనుకడుగుపెడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రేవంత్ ప్రభుత్వం 64 రంగాలను దెబ్బతీస్తూ, బలవంతులను ఆదరిస్తూ, బలహీనులను అణచివేస్తోందని మండిపడ్డారు. ఈ సందేశాన్ని ఓటర్లకు చేరవేయడానికి బీఆర్‌ఎస్ నాయకులు సమావేశాల్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లతో ఉదాహరణలు చూపిస్తున్నారు.
ఈ ఉప ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గ పోటీగా కాకుండా, హైడ్రాకు, ప్రభుత్వ పనితీరుకు రెఫరండంగా బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. బుల్డోజర్ రావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, ఆపాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేటటీఆర్ కోరుతున్నారు.