Spirit Movie Updates: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది సందీప్ రెడ్డి వంగ అనే చెప్పాలి…ఇప్పటి వరకు ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి ఆయనకున్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ప్రభాస్ చేసిన బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు…ఇక రీసెంట్ గా ‘స్పిరిట్’ సినిమా నుంచి ఒక వాయిస్ ఓవర్ రిలీజ్ చేశారు…దానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చిందనే చెప్పాలి…ఇక ఈ సినిమాలో ప్రభాస్ ను వేరే రేంజ్ లో చూపించడానికి సందీప్ రెడీ అవుతున్నాడు…
ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ విళయ తాండవం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ఆ సీన్స్ కి ప్రేక్షకులెవ్వరు సీట్లో కూర్చోలేరనే వార్తలైతే వస్తున్నాయి. ఒక్కో సీన్ చూస్తే అభిమానుల రక్తం మరిగిపోతుందని ప్రతి షాట్ లో ప్రభాస్ ను ఎలివేట్ చేసి చూపించే విధానం అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తున్నాడు…
ఇప్పటికే ఈ సినిమాను 2027 వ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… 2026 సంక్రాంతి కానుకగా ‘రాజాసాబ్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు… ఇక 2026 సంవత్సరం ఎండింగ్ లో ఫౌజీ సినిమాను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక స్పిరిట్ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించి 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడితే సందీప్ రెడ్డి వంగ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారుతాడు. చూడాలి మరి ఈ సినిమాతో సందీప్ ఆ ఫీట్ ను సాధిస్తాడా? లేదా అనేది…
ఒకవేళ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తన నట విశ్వరూపాన్ని చూపిస్తే మాత్రం ఇండియాలోనే టాప్ స్టార్ గా ఎదగడమే కాకుండా నెంబర్ వన్ పొజిషన్ ను సొంతం చేసుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ప్రస్తుతం సందీప్ సైతం ప్రభాస్ ను ‘ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో’ అనే టైటిల్ తో పరిచయం చేశాడు. కాబట్టి ఆ ట్యాగ్ కి న్యాయం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…