Ponnam Prabhakar: తెలంగాణలో కొలువుదీరిని క్యాబినెట్‌లో మరో మంత్రిగా ప్రమాణం చేశారు పొన్నం ప్రభాకర్. గౌడ సామాజికి వర్గానికి చెందిన పొన్నం విద్యార్థి నేతగా ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. అదే పునాదిగగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2009లో అనూహ్యంగా దివంగత ముఖ్యమంత్రి కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి నేతగా చేసిన అనేక ఉద్యమాల స్ఫూర్తితో.. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా వ్యవహరించారు. పార్లమెంటు సభ్యుడిగా ఉండి కూడా సర్వరాష్ట్ర అకాంక్షను పార్లమెంటులో బలంగా వినిపించారు. స్వరాష్ట్ర సాధన కోసం సకల జనులతో కలిసి పోరాడారు.
అత్యంత పిన్న వయసు ఎంపీగా..
2009 నుంచి 2014 వరకు భారత జాతీయ కాంగ్రెస్ తరపున కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు. కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎంపీలలో పొన్నం ప్రభాకరే చిన్న వయస్కుడు. తెలంగాణలోని నాయకులలో ఒకరిగా ఉన్న పొన్నం ప్రభాకర్ విద్యార్థి ఉద్యమకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓటమి..
తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందే సమయంలో ఎంపిగా బిల్లుకు అనుకూలంగా పొన్నం ఓటు వేశారు. అయితే నాడు విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ బిల్లు ఆమోదం పొందడాన్ని తట్టుకోలేక పొన్నం ప్రభాకర్‌పై పెప్పర్‌స్ప్రేతో దాడిచేశాడు. పొన్న కళ్లలో పెప్పర్ స్ప్రె కొట్టడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ప్రతీ తెలంగాణ ఉద్యమకారుడికి గుర్తుంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి కూడా ఓడిపోయారు. మూడోస్థానంలో నిలిచారు. ఈసారి అలా జరుగకుండా పొన్నం నియోజకవర్గం మార్చారు. ఈసారి హుస్నాబాద్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. ప్రభాకర్ కి 2000, ఏప్రిల్ 21న మంజులతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (పృథ్వి, ప్రణవ్).
కీలక పదవులు..
పొన్నం ప్రభాకర్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. పొన్నం ప్రభాకర్ 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్‌గా 2023 ఆగస్ట్ 30న నియమితుడయ్యాడు.
= 1987–1988 మధ్యకాలంలో ఎస్.ఆర్.ఆర్. గవర్నమెంట్ డిగ్రీ, పీజీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నుండి, ఒక విద్యార్థి నాయకుడుగా, యూనియన్ అధ్యక్షుడుగా పనిచేశాడు.
= 1987–1989 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించాడు.
= 1987–1988 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా కళాశాలల కన్వీనర్ గా పనిచేశాడు.
= 1989–1991 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర కార్యదర్శి పదవిని, 1992–1998 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టాడు.
= 1999–2002 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
= 2002–2003 మధ్యకాలంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
= 2002–2004 మధ్యకాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ సమన్వయకర్తగా పనిచేశాడు.
= 2004–2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా పనిచేసారు.
= 2009లో లోక్ సభకు పోటీచేసే వరకు డి.సి.ఎం.ఎస్. అధ్యక్షుడుగా, మార్కుఫెడ్ విదేశాంగ ఛైర్మన్ గా చేశాడు.
= భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2009 లో 15వ లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం ఎం.పి.గా ఎన్నికయ్యాడు.
= 2018 సెప్టెంబరులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం.(2019 సార్వత్రిక ఎన్నికల రాజీనామా చేశాడు)
= తెలంగాణ ప్రాంతం నుండి 15వ లోక్‌సభలో అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడు. రైల్వే, విద్యుత్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు. రసాయనాలు, ఎరువులు, కంప్యూటర్లపై జాతీయ కమిటీల సభ్యుడు. ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేశారు.
మంత్రిగా ప్రమాణం..
తాజాగా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారుడిగా, బీసీ కోటాలో రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం సాధించాడు. రేవంత్‌రెడ్డితో కలిసి మంత్రిగా ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణస్వీకరాం చేశారు. ఎంపీ అయిన తొలిలారి తెలంగాణ బిల్లు సాధించిన పొన్నం. ఎమ్మెల్యే అయిన తొలిసారే మంత్రిగా ప్రమాణం చేయడం విశేషం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Interesting facts about ponnam prabhakar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com