Indiramma illu Application: భారతదేశంలో అతిపెద్ద జీవ నదుల్లో గోదావరి నది ఒకటి. ఈ నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఈ గోదావరి పుట్టినిల్లు మహారాష్ట్రలోని నాసిక్ అని చాలామందికి తెలిసే ఉంటుంది. నాసిక్ కేవలం గోదావరి పుట్టినిల్లు మాత్రమే కాకుండా.. త్రయంబకేశ్వర్ రూపంలో ఇక్కడ మహాశివుడు కొలువై ఉన్నాడు. అయితే ఇక్కడి మహా శివుడి త్రినేత్రంలో ఒక వజ్రం ఉండేది. అది ఇప్పుడు పరాయి పాలనలో ఉన్నట్లు చరిత్ర తెలుపుతుంది. ఇంతకీ ఆ వజ్రం చరిత్ర ఏంటి?
Also Read: ఓవైసీ కాలేజీని కూల్చరు.. రజినీకాంత్ ప్రశ్న.. కాంగ్రెస్ కు ఇక్కడే డ్యామేజ్
ఇందిరమ్మ ఇల్లు కావాలా.. ఇలా చేయండి చాలు..
పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా ప్రతీ నియోజవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. సొంత స్థలం ఉన్నవారినే తొలి విడత లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. అయితే చాలా మంది తమకు అర్హత ఉన్నా ఇల్లు మంజూరు చేయలేదని ఆందోళన చెందుతున్నారు. అర్హత పత్రాలతో కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో తాజా డిజిటల్ అప్‌డేట్‌తో మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మారింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు సమాచారం సులభంగా అందుబాటులోకి రావడమే కాక, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తొలగిపోయింది.
అంతా ఆన్‌లైన్‌లోనే..
తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ (https://indirammaindlu.telangana.gov.in/) ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధిత అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారుల వివరాలు, నిర్మాణ పురోగతి, ఆర్థిక సాయం విడుదల వంటి సమాచారం ఇప్పుడు ఒకే చోట అందుబాటులో ఉంది.
– మార్క్ అవుట్, పునాదులు, గోడలు, స్లాబ్ వంటి నిర్మాణ దశలను రియల్–టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు.
– రూ.5 లక్షల ఆర్థిక సాయం నాలుగు విడతల్లో విడుదలవుతుంది, దాని స్థితి కూడా ఆన్‌లైన్‌లో చూడవచ్చు.
– ఆధార్ వివరాలు, ఫోటోల సమస్యలను త్వరగా గుర్తించి సరిచేయడానికి అవకాశం.
ఈ డిజిటల్ వేదిక పారదర్శకతను పెంచడమే కాక, అవినీతి, ఆలస్యాలను తగ్గిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
నాలుగు భాషల్లో అందుబాటు..
పథకం వెబ్‌సైట్ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది, దీనివల్ల భాషా అవరోధాలు తొలగిపోతాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు తమ మాతృభాషలో సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ బహుభాషా విధానం పథకం యొక్క సమ్మిళిత స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. మునుపటిలో, లబ్ధిదారులు బిల్లుల ఆమోదం, చెల్లింపు స్థితి తెలుసుకోవడానికి హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ సమయం, డబ్బు వృథా అయ్యేది. ఇప్పుడు, ఆన్‌లైన్ వేదిక ద్వారా ఇంటి నుంచే సమాచారం తెలుసుకోవచ్చు. సాంకేతిక లోపాలను త్వరగా గుర్తించి సరిచేయవచ్చు. కార్యాలయాలకు వెళ్లే ఖర్చు, సమయం తగ్గుతాయి. ఈ మార్పు లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించి, పథకం అమలును వేగవంతం చేస్తుంది.
Also Read:
ఎలా ఉపయోగించాలి?
వెబ్‌సైట్‌లో సమాచారం చూడటం సులభం. సాంకేతిక అవగాహన లేకపోయినా సులభంగా ఉపయోగించేలా రూపొందించబడింది.
1. https://indirammaindlu.telangana.gov.in/ ని సందర్శించండి.
2. “Application Search’ ఎంపికపై క్లిక్ చేయండి.
3. ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌తో శోధించండి.
4. నిర్మాణ దశలు, చెల్లింపు వివరాలు, సాంకేతిక లోపాలు వంటివి స్క్రీన్‌పై కనిపిస్తాయి.