Minister Konda Surekha: తెలంగాణ దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. రేవంత్‌రెడ్డి క క్యాబినెట్‌లో మహిళా మంత్రి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులురాలు. కానీ, ఏడాది పాలనలోనే ఆమె మరోసారి మూడుసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. మొన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేసి అందులోకి అక్కినేని కుటుంబాన్ని లాగారు. ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతోంది. తర్వాత ఇంట్లో బీరు పార్టీ అంటూ ఆమె స్వయంగా తన స్నేహితురాలుకు చెప్పడం, ఆ వీడియో వైరల్ కావడం సంచలనంగా మారింది. తాజాగా వేములవాడ రాజన్న కోడెల వివాదం సదరు మంత్రిని చుట్టుకుంది.
తరలిపోయిన రాజన్న కోడెలు..
వేములవాడ రాజన్న క్షేత్రాన్ని దక్షిణ కాశీగా భావిస్తారు. ఇక్కడ కోడెను కట్టే సంప్రదాయం ఉంది. వేలాది కోడెలు రాజన్న ఆలయం ఆధీనంలో ఉంటాయి. అయితే ఇటీవల రాజన్న కోడెలు వరంగల్ జిల్లా గీసుకొంలో ప్రత్యక్షమయ్యాయి. కోడెల పంపిణీలో ఆలయ ఈవో వినోద్‌రెడ్డి ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోడెలు పక్కదిరి పడుతున్నట్లు ప్రచారం జరగుతోంది. దీంతో భజరంగ్‌దళ్ నేతలు ఆందోళన చేపట్టారు. మంత్రి సిఫారసుతోనే ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయాధికారులు అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించారని ప్రచారం జరుగుతోంది. రైతుకు కేవలం రెండు లేదా మూడు కోడెలు ఇవ్వాలి. కానీ, మంత్రి చెప్పారని ఒక్కరికే 49 కోడెలు అప్పగించడం ఇప్పుడు వివాదాస్పదమైంది.
టెండర్ ద్వారా కొనుగోలు..
ఇదిలా ఉంటే రాంబాబు అనే వ్యక్తి మాత్రం తాను టెండర్ ద్వారా 49 కోడెలు క కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిపాడు. కోడెల పక్కదారి విషయమై మంత్రి అనుచరుడైన రాంబాబుపై గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడెలు అప్పగించడంపై భక్తులు కూడా మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెలు ఇవ్వడం వెనుక మంత్రి ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లేఖ వైరల్..
ఇదిలా ఉంటే.. మంత్రి కొండా సురేఖ సిఫారసు చేసినట్లు చెబుతున్న లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భక్తులు ఆంగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేములవాడకు కుటుంబంతో వచ్చిన కొండా సురేఖ.. దర్శనం కారణంగా స్వామివారికి మహానైవేద్యం ఆలస్యం అయింది. దీనిపైనా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కోడెలను పక్కదారి పట్టించడంపై మండిపడుతున్నారు.