https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్..ఈరోజు రోహిణి అవుట్..రేపు ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరంటే!

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం రోజుల్లో ముగియబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 7, 2024 / 02:53 PM IST

    Rohini

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం రోజుల్లో ముగియబోతుంది. ఇన్ని రోజులు ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు, గొడవలు,టాస్కులు, ఎమోషన్స్ తో ఆడియన్స్ కి ఒక రోలర్ కోస్టర్ అనుభూతిని కలిగించింది. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఎలా ఉంటుందో, అలా ఉన్నింది ఈ సీజన్. అయితే ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్. ముఖ్యంగా కమెడియన్స్ గా పిలవబడే రోహిణి, అవినాష్, టేస్టీ తేజ అందించిన ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ కి ఆయువుపట్టు లాగా నిల్చింది. ఇక గౌతమ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీజన్ ‘గేమ్ చేంజర్’ అతనే. ఇదంతా పక్కన పెడితే ఈరోజు రేపు జరగబోయే ఎపిసోడ్స్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.

    గత సీజన్ గ్రాండ్ ఫినాలే లో ఆరు మంది కంటెస్టెంట్స్ ఉండేవారు. కానీ ఈ సీజన్ లో మాత్రం కేవలం 5 మందిని మాత్రమే ఫినాలే కి పంపాలని టీం నేడు ఉదయం మాట్లాడుకున్నారట. ఈరోజు ఒక ఎలిమినేషన్, రేపు ఒక ఎలిమినేషన్ ఉండబోతుంది. ఈరోజు జరిగే ఎలిమినేషన్ లో రోహిణి ఎలిమినేట్ అవుతుందని, రేపు జరగబోయే ఎలిమినేషన్ లో ప్రేరణ ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. ఓటింగ్స్ ముగిసే సమయానికి డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్ళిద్దరే. ప్రారంభం లో విష్ణు ప్రియ, నబీల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎలిమినేట్ అవుతారని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఈ షాకింగ్ ట్విస్ట్ ఆడియన్స్ కి నేడు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేయబోతుంది. నేటి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కాసేపటి క్రితమే మొదలైంది. కొద్ది గంటల్లోనే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది అధికారికంగా తెలియనుంది.

    ఇక టైటిల్ విన్నింగ్ రేస్ లో నిఖిల్, గౌతమ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరి గ్రాఫ్స్ ప్రతీ రోజు మారిపోతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు నిఖిల్ గౌతమ్ పై స్పష్టమైన లీడింగ్ తో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయనకి నిఖిల్ తో సరిసమానమైన ఓటింగ్ పడుతుంది. నేడు నాగార్జున గౌతమ్ ని టార్గెట్ చేస్తే, కచ్చితంగా ఆయన గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటుంది. తెలుగు వాళ్లంతా ఐకమత్యంతో గౌతమ్ ని గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే వచ్చే వారం టెలికాస్ట్ అవ్వబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచేయబోతున్నాడని టాక్. దీనికి సంబంధించి మరికొంత సమాచారం తెలియాల్సి ఉంది.