https://oktelugu.com/

Bigg Boss : జనవరి నుండి ‘బిగ్ బాస్’ తెలుగు OTT 2వ సీజన్ మొదలు..పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వచ్చేసింది!

మన తెలుగు ఆడియన్స్ కి బాగా అలవాటైన రియాలిటీ షో 'బిగ్ బాస్'. సీజన్ 1 ప్రకటించిన కొత్తల్లో ప్రేక్షకులు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 7, 2024 / 03:01 PM IST

    Bigg Boss

    Follow us on

    Bigg Boss : మన తెలుగు ఆడియన్స్ కి బాగా అలవాటైన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. సీజన్ 1 ప్రకటించిన కొత్తల్లో ప్రేక్షకులు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. అర్థం చేసుకున్న తర్వాత ఈ సీజన్ ని ఎగబడి చూసారు. అలా మొదలైన బిగ్ బాస్ 7 సీజన్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సీజన్ ని కూడా మరో వారం రోజుల్లో ముగించుకోనుంది. ఇదంతా పక్కన పెడితే మధ్యలో ఒక ఓటీటీ సీజన్ వచ్చిన సంగతి తెలిసిందే. హాట్ స్టార్ లో ప్రసారమైన ఈ సీజన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, ఎందుకో దీనిని కొనసాగించలేకపోయారు. సీజన్ 7 పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో వెంటనే ఓటీటీ రెండవ సీజన్ ని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అప్పుడే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే పోలీస్ ప్రొటొకాల్స్ ని పాటించకుండా అరెస్ట్ అవ్వడం, అతనికి పలు జాగ్రత్తలు చెప్పకుండా నిర్లక్ష్యం వహించినందుకు బిగ్ బాస్ యాజమాన్యం కి నోటీసులు అందించడంతో ఓటీటీ రెండవ సీజన్ ని ప్రారంభించే ఆలోచనను విరమించుకున్నారు.

    అయితే ఈసారి మాత్రం ఓటీటీ రెండవ సీజన్ ని ఎట్టిపరిస్థితిలోనూ ప్రారంభించాలి అనే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అప్పుడే మొదలు పెట్టారట. ఈ సీజన్ కి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారాయి. గత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ తో పాటు, కొత్త కంటెస్టెంట్స్ కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నారట. ఈ సీజన్ లో రెండవ వారం ఎలిమినేట్ అయినటువంటి శేఖర్ బాషా, మూడవ వారం ఎలిమినేట్ అయినటువంటి అభయ్ నవీన్ వంటి వారు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నారట. అలాగే సీరియల్ హీరోయిన్ మహేశ్వరీ, సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ వంటి వారిని కూడా బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు తెలుస్తుంది.

    వీరితో పాటు సహార్ కృష్ణన్, జ్యోతి రాజ్, బంచిక్ బబ్లూ, సీజన్ 4 కంటెస్టెంట్ అలేఖ్య హారిక, ప్రముఖ యూట్యూబర్ వర్ష తదితరులను కూడా బిగ్ బాస్ టీం సంప్రదించారట. జనవరి మొదటి వారం లో పూర్తి స్థాయి లిస్ట్ బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ లో టీవీ టెలికాస్ట్ కంటే ఎక్కువగా, ఓటీటీ లోనే హైయెస్ట్ వ్యూయర్షిప్ వచ్చిందట. అందుకే ఈసారి ఓటీటీ సీజన్ ని మొదలు పెట్టాలని నిర్ణయించుకుందట బిగ్ బాస్ టీం. అయితే ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడా?, లేకపోతే ఎవరైనా యంగ్ హీరో తో హోస్టింగ్ చేయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీని గురించి కూడా స్పష్టమైన వివరాలు అతి త్వరలోనే బయటకు రానున్నాయి.