https://oktelugu.com/

Ramagiri Qilla : పాండవులు నడియాడిన ఆ జలపాతం నీటిని తాగితే చాలు అన్ని రోగాలు పరార్..

జలపాతం తో ఏర్పడ్డ ఆ గుండంలో స్నానం చేస్తే అంత మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. కోరిన కోర్కెలు నెరవేరుతాయట. అంతేకాదు వర్షాకాలంలో గుట్టపై నుంచి వచ్చే నీటిలో స్నానం చేసి, ఆ నీటిని తాగితే సర్వరోగాలు నయం అవుతాయని అపార నమ్మకం.

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2024 / 08:13 PM IST

    Ramagiri Qilla waterfall

    Follow us on

    Ramagiri Qilla : ప్రకృతి అందాలను చూడటం, వాటిని ఎంజాయ్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ వెళ్లడం కష్టం కదా. అందంగా ఉన్న జలపాతం వద్దకు వెళితే మనసు పులకరిస్తుంటుంది. మీరు చూస్తున్న ఈ ఫోటో లో ఉన్న ప్రదేశం ప్రకృతి అందాలకు నెలవు. ఈ జల దృశ్యాన్ని ఎంజాయ్ చేయడం ఎవరికి నచ్చదు చెప్పండి. భారీ వర్షాలతో ఎత్తైన కొండల నుంచి వచ్చే నీటి నురగల జలపాతం దగ్గర సందడి చేస్తూ ఆడిపాడుతూ ఉంటే అబ్బ ఆ రోజు ఎంత హాయి గా ఉంటుంది కదా. కొన్ని రోజుల పాటు గుర్తుండిపోతుంది. వర్షాలకు గుట్టపై నుంచి నీరు వస్తుంటే టూరిస్టులు ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు ఆ నీరు తాగితే సర్వరోగాలు నయం అవుతాయి అనే నమ్మకం కూడా ఉందట. దీంతో ఆ నీటిని తాగేందుకు, ఆ నీటిలో స్నానం చేసేందుకు అడవి బాటలో వెళ్లడానికి కూడా వెనకాడటం లేదు ప్రకృతి ప్రేమికులు.

    ఒక్కరు కాదు, ఇద్దరు కాదు నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. జాలువారుతున్న జలపాతం లో స్నానం చేసి, ఆ నీటిని తాగి, బాటిల్స్ లో ఇంటికి తెచ్చుకొని మరీ తాగుతుంటారట. వీకెండ్‌లో భారీగా పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలి వస్తారు. ఇంతకీ ఈ జలపాతం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, జాఫర్‌ఖాన్ పేట సరిహద్దుల్లో ఉంది ఈ జలపాతం. రామగిరి ఖిల్లాకు ఆనుకుని ఉంటుంది. ఈ పాండవ లంక కు పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతుంది. కనువిందు చేస్తున్న పాండవుల లంక జలపాత దృశ్యాన్ని ఆస్వాదించడానికి ఎవరైనా వెళ్లాల్సిందే అన్నట్టుగా ఉంది కదా.

    కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా, పరిసర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. పాండవులు వనవాస సమయంలో ఈ లంకలో కొన్ని రోజులు గడిపారట. గుట్టపైన పాండవుల చరిత్ర ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అంతేకాదు వారు ఏర్పాటు చేసిన శివలింగం ఇప్పటికి ఈ ప్రాంతంలో దర్శనం ఇస్తుంది. శ్రీరాముడు కూడా తన వనవాస సమయంలో ఈ శివలింగాన్ని పూజించారని స్థలపురాణం చెబుతోంది. వనవాస సమయంలో భీముడి గద గుట్టపై నుంచి జలపాతం వద్ద కింద పడిందట. ఆ గదను పోలిన ఆనవాళ్లు కూడా ఇక్కడ ఉండటంతో ఎక్కువ విశ్వసిస్తుంటారు.

    జలపాతం తో ఏర్పడ్డ ఆ గుండంలో స్నానం చేస్తే అంత మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. కోరిన కోర్కెలు నెరవేరుతాయట. అంతేకాదు వర్షాకాలంలో గుట్టపై నుంచి వచ్చే నీటిలో స్నానం చేసి, ఆ నీటిని తాగితే సర్వరోగాలు నయం అవుతాయని అపార నమ్మకం. రామగిరి ఖిల్లా గుట్ట నుంచి పాండవుల లంక వరకు ఈ గుట్టపై సంజీవని తో పాటు అనేక ఔషధ గుణాలున్న చెట్లు ఉండటంతో ఈ నీటిని తాగితే సర్వరోగాలు నయమవుతాయి అంటున్నారు కొందరు. దీంతో ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నారు టూరిస్టులు. అయితే ఈ ప్రాంతానికి వెళ్లడానికి మాత్రం సరైన రోడ్డు మార్గం లేదు. అయినా సరే ఈ ఆయుర్వేద ఆకులన్నీ నీటిలో కలిసి ఔషధంగా మారుతున్నాయని అన్ని రకాల రోగాల నుంచి విముక్తి లభిస్తుందని స్థానికులు నమ్మకంతో అక్కడికి వెళ్తున్నారు.