https://oktelugu.com/

Kangua movie : తమిళ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కంగువా సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారా..? కారణం ఏంటంటే..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ పాన్ ఇండియా లో భారీ మార్కెట్ ను క్రియేట్ చేయడం ఎవ్వరూ వల్ల కావడం లేదు...అందుకే సౌత్ లో వాళ్ళు మాత్రమే అందరికంటే వెనకబడి పోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 8, 2024 / 08:06 PM IST

    Kangua movie

    Follow us on

    Kangua movie : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటై అయిపోవడంతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని కొట్టడానికి చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా ప్రతి ఒక్కరూ తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే తమిళ్ హీరోలు సైతం పాన్ ఇండియా మీదనే కన్నేసినట్టుగా తెలుస్తోంది. వాళ్లు అనుకున్నట్టుగానే ఇప్పుడు వచ్చే సినిమాలతో భారీ సక్సెస్ లో సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఎవరు పాన్ ఇండియాలో అంత పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. కాబట్టి ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా విక్రమ్ తంగలాన్ సినిమాతో కొంతవరకు ఇంపాక్ట్ ను చూపించినప్పటికీ సూర్య మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా కంగువా సినిమాకు సంబంధించిన అప్డేట్ ని కూడా ఇస్తూ ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అంటూ సినిమా మేకర్స్ అయితే ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి కూడా పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. సూర్యతో పాటు తమిళ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు.ఇక తన నటవిశ్వరూపంతో ఈ సినిమాని విజయ తీరాలకు చేర్చే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

    మరి మొత్తానికైతే ఈ సినిమాను కనక సూపర్ సక్సెస్ గా నిలిపినట్లైతే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా నీరాజనాలు పడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇంతకుముందు భారతీయుడు 2 సినిమా పాన్ ఇండియా మూవీ గా వచ్చినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక దాంతో కంగువా సినిమా మీదనే ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక పెను భారాన్ని వేసి ఉంచినట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమా కమర్షియల్ గా భారీ సక్సెస్ ని అందుకున్నట్లయితే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి కూడా పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పోల్చుకుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు పాన్ ఇండియాలో చాలా వరకు వెనుకబడి పోతున్నారు. కాబట్టి ఎలాగైనా సరే వాళ్లు కూడా తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. చూడాలి మరి సూర్య ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు అనేది…