https://oktelugu.com/

OG Movie : ‘ఓజీ’ చిత్రంలో పాట పాడినందుకు తమిళ హీరో శింబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఈ పాట పెద్ద హిట్ అయ్యింది, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా ఆయనకి అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఫంక్షన్ లో శింబు మాట్లాడుతూ 'నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని, ఆయన సినిమాకి పాట పాడే అదృష్టం కోసం ఎదురు చూస్తాను' అని అన్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 08:31 PM IST

    Tamil hero Simbu's remuneration for singing a song in the movie 'OG'

    Follow us on

    OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ఏదైనా ఉందా అంటే, అది ‘ఓజీ’ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు. నేటి తరం యూత్ కి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. రీమేక్ సినిమాలతో ఆయన చాలా సమయం వృధా చేసాడని అభిమానుల్లో ఒక అసంతృప్తి ఉంది. అలాంటి సినిమాలను దగ్గరుండి చేయించినందుకు త్రివిక్రమ్ ని పచ్చి బూతులు తిట్టేవారు. ముఖ్యంగా ‘బ్రో ది అవతార్’ సినిమా సమయంలో త్రివిక్రమ్ ట్విట్టర్ లో ఉండుంటే పాపం ఏమయ్యేవాడో,ఆ అంత ఆవేశం తో ఊగిపోయారు ఫ్యాన్స్.

    అలాంటి సమయంలో అభిమానులకు ఓజీ చిత్రానికి సంబంధించిన న్యూస్ వచ్చింది. పూనకాలతో ఊగిపోయారు. కాన్సెప్ట్ పోస్టర్ కి మెంటలెక్కిపోయిన అభిమానులు, గ్లిమ్స్ వీడియో కి అడిక్ట్ అయిపోయారు. ఈ గ్లిమ్స్ ఈ చిత్రం మీద పెంచిన అంచనాలు మామూలివి కావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ‘ఓజీ..ఓజీ’ అని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారంటే, ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పెండింగ్ వర్క్ ఉండడం తో పోస్టర్ ద్వారా మొదటి లిరికల్ వీడియో సాంగ్ డేట్ చెప్తామని చెప్పారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలతో జనాలు ఇబ్బంది పడుతుంటే, మనం సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ చెప్పడం మంచిది కాదు అనే ఉద్దేశ్యంతో, పవన్ కళ్యాణ్ తన నిర్మాతలకు ఇప్పుడేమి వద్దు ఆపేయండి అని ఆదేశాలు ఇవ్వడంతో నిర్మాతలు ఆపేసారు. అయితే ఈ మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి సంబంధించి చాలా సమాచారం అందింది. ఈ పాటని తమిళ స్టార్ హీరోలలో ఒకరైన ‘శింబు’ తో పాడించాడట మ్యూజిక్ డైరెక్టర్ థమన్. శింబు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, ఈ విషయాన్ని ఆయన అనేక సార్లు చెప్పాడు. గతంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బాద్షా’ చిత్రంలో ఒక పాట పాడాడు.

    ఈ పాట పెద్ద హిట్ అయ్యింది, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా ఆయనకి అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఫంక్షన్ లో శింబు మాట్లాడుతూ ‘నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని, ఆయన సినిమాకి పాట పాడే అదృష్టం కోసం ఎదురు చూస్తాను’ అని అన్నాడు. ఇప్పుడు ఆయన కోరిక నెరవేరింది. అయితే ఈ పాట పాడినందుకు శింబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా, అక్షరాలా ‘సున్నా’. ఇది కేవలం ఆయన పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానంతో పాడిన పాట అట, అందుకే రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.