https://oktelugu.com/

TV 5 Journalist Murthy : వేణుస్వామి ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టిచంపండి: జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి

మూర్తి నిన్న స్పెషల్ లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వెంటనే స్పందించాడు. ఆయన మాట్లాడుతూ 'నేను 30 ఏళ్ళ నుండి జర్నలిజంలో ఉన్నాను. నేను పని చేసిన మీడియా సంస్థలలో నాకు వచ్చే నెలవారీ జీతం తప్ప, బయట నేను ఎవరినైనా డబ్బులు డిమాండ్ చేసానని నిరూపిస్తే, జనాలు నన్ను కొట్టి చంపేయొచ్చు. గత 8 ఏళ్లుగా నేను ఒకే ఫోన్ వాడుతున్నాను.

Written By:
  • Vicky
  • , Updated On : August 20, 2024 / 12:29 PM IST

    TV 5 Journalist Murthy - Venu swamy

    Follow us on

    TV 5 Journalist Murthy : నిన్న సాయంత్రం ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తన భార్య వీణ శ్రీవాణి తో కలిసి విడుదల చేసిన ఒక వీడియో సంచలనం గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. టీవీ 5 లో న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తున్న మూర్తి తమని 5 కోట్ల రూపాయిలు ఇవ్వమని బెదిరిస్తున్నాడని, వారం రోజుల నుండి ఈ టార్చర్ ఎక్కువ అయ్యిందని, 8 నెలల క్రితం మొదలు పెట్టారని, నా మీద లేని పోనీ అసత్య ప్రచారాలు , కథనాలు చేసి నన్ను మానసికంగా ఎంతో క్షోభ పెట్టారని, ఆ క్షోభ కారణంగానే నేను 15 కిలోలు తగ్గిపోయానని, ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపింది. అంతే కాదు రిపోర్టర్ అమర్ అనే వ్యక్తి ఎవరో అమ్మాయితో వేణు స్వామి నుండి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక ఆడియో రికార్డు ని కూడా విడుదల చేసారు.

    దీనిపై మూర్తి నిన్న స్పెషల్ లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వెంటనే స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను 30 ఏళ్ళ నుండి జర్నలిజంలో ఉన్నాను. నేను పని చేసిన మీడియా సంస్థలలో నాకు వచ్చే నెలవారీ జీతం తప్ప, బయట నేను ఎవరినైనా డబ్బులు డిమాండ్ చేసానని నిరూపిస్తే, జనాలు నన్ను కొట్టి చంపేయొచ్చు. గత 8 ఏళ్లుగా నేను ఒకే ఫోన్ వాడుతున్నాను. నెంబర్ కూడా ఇదే, మీతో ఒక్కసారి కూడా నేను ఫోన్ లో వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నా మీద దేశద్రోహి కేసు ఉంది కాబట్టి , నా నెంబర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల నిఘాలో ఉన్నాయి. నా ఫోన్ రికార్డ్స్ కూడా చూసుకోండి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో  గవర్నర్ ND తివారీ స్టోరీని బయటపెట్టింది నేను. అంత పెద్ద గవర్నర్ కి సంబంధించిన స్టోరీ ఆధారాలతో సహా నా దగ్గర ఉంది, అతనిని నేను డిమాండ్ చేసి ఆ స్టోరీ బయటకి రాకుండా ఎంత డబ్బులైనా డిమాండ్ చేసి ఉండొచ్చు. కానీ అలా చెయ్యలేదు. అలాంటిది మీ మీద చేస్తానా?’ అంటూ మూర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    ఈ ఆడియో టేప్ వాళ్ళే సృష్టించి ఉండొచ్చు, అలాంటి తెలివితేటలు వెనుస్వామి కి  చాలానే ఉన్నాయి. ఒకవేళ నా పేరు వాడుకొని ఈ దంపతులిద్దరి దగ్గర డబ్బులు వసూలు చెయ్యాలనుకుంటే మాత్రం వీళ్ళని ప్రభుత్వాలు కాపాడాల్సిందే. వెళ్లి పోలీస్ కేసు ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆ అమర్ అనే వ్యక్తి టీవీ 5 స్టాఫ్ లోనే లేడని, మరి మీకు ఏ అమర్ చేసాడో నాకు తెలియదని, ఒకవేళ ఆ ఆడియో టేప్ నిజమైతే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వండి అంటూ ఈ మూర్తి సలహా ఇచ్చాడు. మరి దీనికి వేణు స్వామి స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.