https://oktelugu.com/

Stree 2 Movie : రికార్డుల వేటలో స్ట్రీ 2…ప్రభాస్, షారుఖ్ ఖాన్ రికార్డులు కూడా బ్రేక్ అవ్వనున్నాయా..?

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు...ఖాన్ త్రయం నుంచి టైగర్ ష్రాఫ్ వరకు ప్రతి ఒక్కరు సక్సెస్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 20, 2024 / 12:18 PM IST

    Stree 2 Movie Records

    Follow us on

    Stree 2 Movie : బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలేవి ఆశించిన విజయాలను అందుకోవడం లేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయిందని అందరు అనుకుంటున్నా సమయంలో శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావులు లీడ్ రోల్ పోషించిన స్ట్రీ 2 సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ రావడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇక ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్ హీరోల వల్ల కానీ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటికే 235 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇప్పటికి కూడా భారీ కలెక్షన్స్ తో ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి క్రమం లో ఈ సినిమా రాబోయే రోజుల్లో ఓవర్సీస్ లో గానీ పాన్ ఇండియాలో గాని కల్కి రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల రేంజ్ అనేది రోజురోజుకీ పెరిగి పోతుంది. ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన డంకి సినిమా అలాగే కల్కి సినిమాలు ఈ సంవత్సరం భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుందంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

    చాలా రోజుల తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇలాంటి ఒక బ్రేక్ దొరకడం అనేది నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. ఇక చావు బ్రతుకుల్లో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి ప్రాణాలతో నిలబెట్టిన సినిమా మాత్రం ఈ సినిమానే అని చెప్పాలి. ఇప్పటివరకు ఖాన్ త్రయం నుంచి వచ్చిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ లను సాధించలేదు.

    అలాగే సక్సెస్ ల హీరోగా పేరుపొందిన అక్షయ్ కుమార్ కూడా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఆయన దాదాపు గడచిన మూడు సంవత్సరాల్లో 13 డిజాస్టర్లను అందుకోవడం అనేది బాలీవుడ్ ఇండస్ట్రీ పతనానికి మరో కారణమనే చెప్పాలి. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలు మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీ వైపు చూస్తున్న సమయంలో స్ట్రీ 2 సినిమా క్రియేట్ చేస్తున్న ప్రభంజనం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

    ఇక సౌత్ సినిమాలే కాదు బాలీవుడ్ సినిమాలు కూడా తమ స్టామినా ను చూపించబోతున్నాయని చెప్పడానికి ఈ సినిమాని ఉదాహరణగా చూపించవచ్చు… చూడాలి మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది అనేది…