Telangana: తెలంగాణలో మళ్లీ భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం మరోమారు బదిలీ చేసింది. నాలుగు రోజుల క్రితమే 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా మరోమారు బదిలీలు చేసింది. ఈ క్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని ఇటీవల బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతిని నియమించింది. అయితే తాజా బదిలీల్లో పమేలా సత్పతిని కొనసాగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అనురాగ్ జయంతిని ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయ జోనల్ కమిషనర్‌గా నియమించారు.
ఏం జరిగింది…
కరీంనగర కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ నిలిచిపోవడం వెనుక ఏం జరిగిందన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పమేలా సత్పతిని కరీంనగర్ కలెక్టర్‌గా నియమించింది. ఆమె సారథ్యంలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. మరోవైపు కలెక్టర్ పనితీరుపై కూడా ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేవు. ఈ నేపథ్యంలో ఆమెనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: Revanth Reddy: కేసీఆర్ చేసిన తప్పే.. రేవంత్ చేస్తున్నాడు.. రిజల్డ్ రిపీట్!
కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఒత్తిడితో..
పమేలా సత్పతి బదిలీపై కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒత్తిడి చేశారని తెలుస్తోంది. కలెక్టర్ పనితీరు బాగున్నందున ఆమె బదిలీ నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల బదిలీ అయినా.. ఆమె విధుల నుంచి రిలీవ్ కాలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా బదిలీల్లో పమేలా సత్పతిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిసింది.
Also Read: Mahalakshmi Scheme : మహిళలకు షాక్.. రూ.2,500 పథకం వీరికి మాత్రమే..
నిక్కచ్చిగా..
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. పైరవీలు అంటే అసలే పడదు. ఏదైనా పని మీద వచ్చేవారు ఎవరితోనైనా పైరవీ చేసుకొని వస్తే కలెక్టర్‌కు అసలు నచ్చదు. సమస్య పరిష్కారానికి డైరెక్టుగా వెళితే మాత్రం పరిష్కారానికి చొరవ చూపిస్తుంటారు. అధికారులు సైతం వనికి పోతుంటారు అర్హులైన వారు జెన్యూన్‌గా ఉంటే కచ్చితంగా సమస్య పరిష్కారానికి ముందుగా చర్యలు తీసుకుంటారు. అసలైన పేదలకు అన్యాయం జరగవద్దని నిత్యం సమావేశంలో చెబుతూనే ఉంటారు. అవినీతిని మాత్రం సహించరు. జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో ప్రధానంగా కృషి చేస్తున్నారు. ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు.