https://oktelugu.com/

AP Cabinet : నిరుద్యోగులకు ఏపీ క్యాబినెట్ గుడ్ న్యూస్

AP Cabinet గత ప్రభుత్వం 6000 పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియను ఎన్నికల ముందు ప్రారంభించింది. దానికి పదివేల పోస్టులను జత చేస్తూ చంద్రబాబు మెగా డీఎస్సీ ప్రకటించారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2024 / 02:28 PM IST

    AP cabinet announced Mega DSC for unemployed

    Follow us on

    AP Cabinet : ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. మెగా డీఎస్సీ నిర్వహణకు వీలుగా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికేసీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి ఫైల్ పై తొలి సంతకం చేశారు.అటు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సైతం ఈ ఫైల్ పై ఈరోజు సంతకం చేశారు. మరోవైపు తొలిసారిగా ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది. జూలై 1 నుంచి మెగా డీఎస్సీ నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. క్యాబినెట్ భేటీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక చేసిన ఐదు సంతకాలపై ముందుగా చర్చ జరిగింది.

    అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభించింది చంద్రబాబు సర్కార్. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు క్యాబినెట్ ముందుకు వచ్చాయి. అలాగే డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ ను కూడా అధికారులు క్యాబినెట్ ముందు ఉంచారు. దీనిపై చర్చించిన క్యాబినెట్ జూలై 1 నుంచి మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం నెలకొంది. చంద్రబాబు తొలి సంతకం చేసినప్పుడే వైసీపీ నుంచి ఒక రకమైన కామెంట్స్ వినిపించాయి. మెగా డీఎస్సీ అంటే 16 వేల ఉపాధ్యాయ పోస్టులేనా? అని ఎక్కువ మంది ట్రోల్ చేశారు.

    అయితే వీలైనంత త్వరగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. డిసెంబర్ లోగా ప్రక్రియను పూర్తి చేసి.. ఉపాధ్యాయులను వీధుల్లోకి తీసుకోవాలని చూస్తోంది. అయితే ఇప్పటికే నిర్వహించిన టెట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలా? లేదా? అనే అంశాలపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తానికైతే 6 నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ వుంది. గత ప్రభుత్వం 6000 పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియను ఎన్నికల ముందు ప్రారంభించింది. దానికి పదివేల పోస్టులను జత చేస్తూ చంద్రబాబు మెగా డీఎస్సీ ప్రకటించారు.