Police Pre Wedding Shoot: పెళ్లంటే నూరేల్ల పంట.. భారతీయ సంస్కృతిలో కులమతాలకు అతీతంగా వివాహ బంధానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పెళ్లిని కూడా మెమరబుల్‌గా మార్చుకుంటున్నారు. పొటోలు, వీడియోల నుంచి ఇప్పుడు ప్రీవెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ, పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలపై నేటితరం ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఖర్చుకు వెనుకాడకుండా.. వేడుకలు నిర్వహిస్తోంది. ఇద్దరు పోలీసులు కూడా ప్రేమించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అందరిలాగే ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. కానీ, దానిని కూడా కొంతమంది వివాదాస్పదం చేశారు. పోలీసులు కాబట్టి ఏమీ చేసుకోవద్దు అనే రీతిలో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు.
అది దేశంలోనే నంబర్ వన్ పోలీస్ స్టేషన్.. అక్కడే ఎస్సైగా పనిచేస్తోంది భావన. అదే ఠాణాలో ఆర్‌ఎస్సైగా పనిచేస్తున్నాడు రావూరి కిషన్.. ఇటీవలే ఇద్దరికీ పెళ్లి కుదిరింది. మంచి పొజిషన్‌లో ఉన్నారు. అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి. దీంతో అందరిలాగే తామూకూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ వారు ఎంచుకున్న లొకేషనే వారిని అడ్డంగా బుక్ చేసింది. ఇంతకీ వారు ఎంచుకున్న లొకేషన్ ఏంటంటే.. వారు çపనిచేస్తున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్.. వారి అధికారిక వాహనాలే.
ప్రేమించి.. పెళ్లికి సిద్ధమై..
పంజాగుట్ట ఠాణాలో ఎస్సైగా పనిచేస్తున్న భావన.. అదే స్టేషన్‌లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్న రావూరి కిషన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఇంట్లో పెద్దలను ఒప్పించారు. పెద్దల అంగీకారంలో పెళ్లికి సిద్ధమయ్యారు.
ప్రీవెడ్డింగ్ షూట్ కోసం..
పెళ్లి జీవితంలో మరపురాని ఘట్టం కావడంతో అందరూ దానిని అందంగా.. మచ్చిపోలేని విధంగా నిర్వహించుకోవాలనుకుంటున్నారు. అదే విధంగా భావన, కిషన్ కూడా భావించారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి.. ప్రీవెడ్డింగ్ షూట్ మరింత అందంగా ఉండాలనుకున్నారు. అందరకన్నా భిన్నంగా ఉండాలని ఆలోచించారు.
ఠాణాలో షూట్..
అయితే.. వారు ఈ ప్రీవెడ్డింగ్ షూట్ లొకేషన్ కోసం పంజాగుట్ట ఠాణానే ఎంపిక చేసుకోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఠాణా మనదే కదా అనుకున్నారో ఏమో.. ఎస్సై, ఆర్‌ఎస్సై ఇద్దరూ వీడియో గ్రాఫర్‌ను పిలిపించుకుని ఠాణా ఆవరణలో ప్రభుత్వ వాహనాలను వాడుతూ వీడియో షూట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో ఈ ఇద్దరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
యూనిఫాంలో.. అధికారిక వాహనంలో..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అది కూడా యూనిఫామ్‌లో.. ప్రభుత్వ వాహనాన్ని వాడుకుని ఈ వీడియో షూట్ చేశారు. దీంతో వీరిద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రజలు మండిపడుతున్నారు. వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అటు పోలీస్ అధికారులు కూడా ఫైర్ అవుతున్నారు. ఇక్కట ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరి పెళ్లి ఆగస్టు 26న జరిగింది. కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వాళ్లూ మనుషులే కదా..
అయితే కొంత మంది నెటిజన్లు మాత్రం వాళ్లూ మనుషులే కదా.. ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకోవద్దా అని కూడా ప్రశ్నిస్తున్నారు. వారికి కేటాయించిన వాహనాన్ని ఏదైనా ఇతర పనులకు వాడుకుంటే పొరపాటు కానీ.. ఐదు నిమిషాల వీడియో కోసం వాడుకుంటే తప్పేముందంటున్నారు. అధికారం ఉందని దుర్వినియోగం చేస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. కానీ, వీరినే టార్గెట్ చేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
#Watch | Pre-wedding shoot of two #Hyderabad cops goes viral. pic.twitter.com/Lk0tiKiLnQ
— Deccan Chronicle (@DeccanChronicle) September 16, 2023