Viveka Case: వివేకా హత్య కేసులో కీలక ట్విస్ట్. సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం ఏకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన వాంగ్మూలం ఉపసంహరణకు అవకాశం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బ్యూరోక్రసీ వ్యవస్థలో కీలక అధికారిగా వ్యవహరించిన అజయ్ కల్లాం తీరును తప్పుపడుతోంది. ఇందులో కఠిన చర్యలకు ఉన్న సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2019 మార్చి 15 న వివేక హత్య వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య విషయం నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు ముందుగానే తెలిసిందని నిర్ధారించేందుకు సిపిఐ అజయ్ కల్లాం వాంగ్మూలాన్ని సేకరించింది. వివేకా హత్య జరిగిన రోజున.. వేకువుజాము సమయంలో లోటస్ ఫండ్లో జగన్ తో అజయ్ కల్లాం ఉన్నట్టు గుర్తించిన సిబిఐ.. కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 29న ఆయన నుంచి వాంగ్మూలాన్ని సేకరించింది. అజయ్ కల్లాం సమ్మతితోనే సిబిఐ రికార్డ్ చేసింది. అజయ్ కల్లాం ఇచ్చిన వాంగ్మూలమే కొన్ని సందేహాలను నివృత్తి చేసేలా ఉంది. అయితే తాను నాడు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అజయ్ కల్లాం మాట మార్చడాన్ని సిబిఐ సీరియస్ గా తీసుకుంది. సీనియర్ బ్యూరో క్రాఫ్ట్ గా పని చేసిన వ్యక్తి ఇలా మాట మడతేయడం పై విస్తు పోయింది. ఆ స్థాయి వ్యక్తి మాట మార్చిస్తే.. వివేకా హత్య కేసులో మిగిలిన సాక్షుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆయన దుర్బుద్ధితోనే ఈ పిటీషన్ వేశారని.. దానిని కొట్టివేయాలని కోర్టును సీబీఐ కోరింది.వాస్తవానికి మే మూడో వారంలో మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా అజయ్ కల్లాం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తానిచ్చిన వాంగ్మూలం ఒకటైతే.. సీబీఐ వక్రీకరించిందని విమర్శలు చేశారు. అయితే ఈ కేసులో 161 సిఆర్పిసి ప్రకారం సాక్షిగా విచారించామని.. ఆయన సమ్మతిని తీసుకున్నామని సిబిఐ స్పష్టంగా చెబుతోంది.
ఒక మాజీ ఐఏఎస్ అధికారి వాంగ్మూలం ఇచ్చి.. దర్యాప్తు సంస్థ పైన, దర్యాప్తు అధికారుల పైన ఆరోపణలు చేయడం విస్తు గొలుపుతోంది. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన రాజకీయ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేకా హత్య కేసు విచారణలో కావాలనే జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైపే అందరివేళ్ళు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న అజయ్ కల్లాం మాట మార్చడం పై రకరకాల ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.