Hyderabad Metro: హైదరాబాద్​ మెట్రో మరో రికార్డు.. ఆరున్నరేళ్లలో 50 కోట్ల మంది జర్నీ..

హైదరాబాద్‌లో మెట్రో రైలును 2017, నవంబర్‌ 29న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మొదట మియాపూర్​నుంచి అమీర్​పేట- నాగోల్​మార్గంలో సేవలు మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : May 4, 2024 9:14 am

Hyderabad Metro

Follow us on

Hyderabad Metro: దేశంలో మూడో పొడవైన మెట్రో నెట్‌వర్క్‌గా గుర్తింపు ఉన్న హైదరాబాద్​ మెట్రో రైలుతో ప్రయాణికుల అనుబంధం కొనసాగుతోంది. మెట్రో ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు(ఆరున్నరేళ్లలో) 50 కోట్ల మంది ప్రయాణించినట్లు సంస్థ ప్రకటించింది. ప్రతీరోజు సగటున 5 లక్షల మంది మెట్రోలో గమ్యస్థానానికి చేరుకుంటున్నారని వెల్లడించింది. ఈ సందర్భంగా కస్టమర్, గ్రీన్​మైల్​లాయల్టీ క్లబ్‌ను ఎల్​అండ్​టీ హైదరాబాద్​ మెట్రో రైలు సంస్థ శుక్రవారం(మే 3న)ప్రారంభించింది.

2017లో ప్రారంభం..
హైదరాబాద్‌లో మెట్రో రైలును 2017, నవంబర్‌ 29న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మొదట మియాపూర్​నుంచి అమీర్​పేట- నాగోల్​మార్గంలో సేవలు మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. తర్వాత 5 దశల్లో పూర్తిగా 69.2 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. కారిడార్‌-1 మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గంలో 2.5 లక్షల మంది నిత్యం ప్రయాణిస్తున్నారు. కారిడార్‌-3 నాగోల్‌ – రాయదుర్గం మార్గం కూడా రద్దీ ఉంటుంది. కారిడార్ – 2 జేబీఎస్​నుంచి ఎంజీబీఎస్​వరకు సగం మాత్రమే అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉంది.

రోజుకు 5 లక్షల మంది..
మొత్తంగా సగటున హైదరాబాద్‌ మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 1.50 లక్షల మంది ఐటీ ఉద్యోగులే కావడం గమనార్హం. ఇక విద్యార్థులు 1.20 లక్షల మంది నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారు, 2023, జులై వరకు 40 కోట్లు మంది ప్రయాణించగా, 9 నెలలులోనే మరో 10 కోట్ల మందిని ప్రయాణించడం విశేషం.

తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యం..
ఇక మెట్రో రైళ్లలో ప్రయాణ చార్జీలు తకు‍్కవ. సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుంది. ట్రాఫిక్‌ తిప్పలు లేవు. దంతో ప్రజల నుంచి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. దీంతో రికార్డులను సృష్టిస్తోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో మెట్రో రైళ్లు సరిపోక ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం రైళ్లను అద్దెకు తెచ్చి నడపాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత రైళ్ల పెంపు కార్యచరణపై స్పష్టత రానుంది.