Fake Apps
Fake Apps: గూగుల్ ప్లే స్టోర్‌లో ఏదైనా యాప్ కోసం సెర్చ్ చేయగానే అదే పేరుతో అనేక యాప్స్ దర్శనమిస్తున్నాయి. వీటిలో ఆసలైన యాప్ ఏదో.. నకిలీ యాప్ ఏదో గుర్తించడం కష్టంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వం అందించే వివిధ రకాల సేవల కోసం చాలా మంది యాప్స్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రభుత్వ యాప్స్ తరహాలోనే లోగోతో ఫేక్ యాప్స్ కనిపిస్తున్నాయి. అది నకిలీదని గుర్తించకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఫేక్ యాప్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. అందులో భాగంగా ప్రభుత్వ యాప్‌లకు లేబుల్స్ తీసుకురానుంది.
‘ఎక్స్’ గ్రే టిక్ తరహాలో..
ఎక్స్’లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాలను సులువుగా గుర్తించేందుకు ఎక్స్‌లో గ్రే టిక్ ఇచ్చారు. దీంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్నవారిని గుర్తించడం ఈజీ అయింది. అచ్చం ఆ తరహాలోనే గూగుల్ ప్లే స్టోర్ లేబుల్స్‌ను తీసుకువచ్చింది. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లకు లేబుల్ దర్శనమివ్వనుంది. ఆ లేబుల్స్‌పై క్లిక్ చేస్తే ఒక పాప్-అప్ ఓపెన్ అయి వెరిఫైడ్ అని చూపుతుంది. ఇలా అసలైన యాప్‌ను నిర్ధారించుకోవచ్చు.
14 పైగా దేశాల్లో అమలు..
భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ప్రాన్స్, యూకే, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికోతోపాటు 14 కనా‍్న ఎక్కువ దేశాల్లో ఈ లేబుల్స్ రోల్ అవుట్ చేశామని, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయని గూగుల్ తెలిపింది.
ఎమోజీలు..
మరోవైపు గూగుల్ డైలర్‌లో సంబాషణలకు సౌండ్ ఎఫెక్ట్‌ను జోడించే ఆడియో ఎమోజీస్’ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. ఈ ఎమోజీలు క్లాపింగ్, లాఫింగ్, పార్టీ క్రయింగ్, పూప్ స్టింగ్.. ఇలా ఆరు రకాల శబ్దాలు చేస్తాయి. వీటిని కాల్ మట్లాడే సమయంలో వీటిని ఎంచుకుంటే ఆ తరహా సౌండ్ ఎఫెక్ట్‌లు కాలర్‌కు, రిజీవర్‌కు ఇద్దరికీ వినిపిస్తాయి. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి బీటా టెస్టింగ్ దశలోనే ఉంది.