CM Revanth Reddy: ఏపీకి సీఎం ఆయనే.. రేవంత్ ఫుల్ క్లారిటీ

ఏడు నెలల కిందట తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కానీదాయాది రాష్ట్ర సీఎం గా,ప్రోటోకాల్ పాటిస్తూసీఎం జగన్ నుంచి ఎటువంటి శుభాకాంక్షలు రేవంత్ రెడ్డికి అందలేదు.

Written By: Dharma, Updated On : May 22, 2024 6:53 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా? కొత్త పాలకుడు వస్తేనే రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని భావిస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చగా మారింది. తెలంగాణ సీఎం అయిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి ఏపీ వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీతో సత్సంబంధాలు కొనసాగిస్తానని.. కొత్త సీఎంతో భేటీ అవుతానని చెప్పడం సరికొత్త సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ఏపీలో ప్రభుత్వం మారబోతుందన్న సంకేతాలు రేవంత్ పంపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏడు నెలల కిందట తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కానీదాయాది రాష్ట్ర సీఎం గా,ప్రోటోకాల్ పాటిస్తూసీఎం జగన్ నుంచి ఎటువంటి శుభాకాంక్షలు రేవంత్ రెడ్డికి అందలేదు. ఇదే విషయాన్ని రేవంత్ బాహటంగానే చెప్పుకొచ్చారు. తనకు ఏపీ నుంచి ఎటువంటి శుభాకాంక్షలు సంకేతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. పైగా రేవంత్ సీఎం అయిన తర్వాత ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు ఆయనకు గౌరవపూర్వకంగా కలిశారు. దీనిని కూడా జగన్ తప్పు పట్టారు. సొంత పార్టీ ఎంపీలకు చివాట్లు పెట్టినట్లు ప్రచారం జరిగింది. రేవంత్ అంటే ఎందుకో జగన్ కు పడడం లేదు. ఆయన చంద్రబాబు పట్ల గౌరవంగా ఉంటారనో.. లేకుంటే కెసిఆర్ ను ఓడించారనో తెలియదు కానీ.. విపరీతమైన ద్వేష భావం కలిగి ఉంటారు. కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా మనసు అంగీకరించలేదు.

అయితే సాటి తెలుగు రాష్ట్రం గా ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవ బోతున్నారో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టమైన సమాచారం ఉంటుంది. అందుకే ఆయన కొత్త ప్రభుత్వం కొలువుదీరాక.. కొత్త సీఎంతో భేటీ అవుతానని చెప్పడం చర్చకు దారితీస్తోంది. ఏపీలో తప్పకుండా కూటమి గెలిచే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తారని సమాచారం ఉంటే.. రేవంత్ ఈ తరహా ప్రకటన చేసి ఉండేవారు కాదన్న టాక్ నడుస్తోంది. మొత్తానికైతే ఏపీలో విజేత ఎవరో స్పష్టమైన సంకేతాలు పంపించారు రేవంత్ రెడ్డి. మరి జూన్ 4న వచ్చే ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.