HCU Land Issue: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వివాదం జరుగుతోంది. ఈ భూములు బయోడైవర్సిటీ పరిధిలోనివని ప్రతిపక్షాలు.. కాదు కాదు అక్కడ జీవవైవిధ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం పరస్పరం వాదించుకుంటున్నాయి.
Also Read: రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి వేరువేరుగా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను విక్రయించొద్దని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతున్నారు. ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడో అపార్ట్మెంట్లోకి వచ్చిన జింకకు సంబంధించిన వీడియోను.. నెమళ్లు, జింకలు ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించి.. కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెసిబిలు చెట్లను పెకిలిస్తుండగా మూగ జీవాలు కన్నీరు పెడుతున్నాయని పేర్కొంటున్నారు. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇవన్నీ తప్పని.. ప్రతిపక్షాలు లేని రాద్ధాంతం చేస్తున్నాయని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ సాగుతోంది.. వైసిపి అనుకూల ట్విట్టర్ హ్యాండిల్స్ లో నాడు విశాఖపట్నంలోని రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పర్యాటక అతిథి గృహాలు నిర్మించినప్పుడు.. పర్యావరణం నాశనం అవుతుందని గోలపెట్టిన వారు.. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో 400 ఎకరాలకు సంబంధించి విధ్వంసం జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
నాడు ఎంతలా ప్రశ్నించారంటే..
” నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రిషికొండ ను అభివృద్ధి చేసి అతిథి గృహాలు నిర్మించారు. వాటి ద్వారా విశాఖపట్నం కి సరికొత్త శోభ వచ్చింది. కానీ దానిని కొంతమంది వ్యతిరేకించారు. పర్యావరణానికి హాని జరుగుతోందని శోకాలు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చదును చేస్తుంటే నోరు మూసుకున్నారు. నాడు పర్యావరణ విధ్వంసం జరిగిందని మొత్తుకున్న వారు.. ఇప్పుడు ఎక్కడికి పోయారని” వైసిపి అనుకూల నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. ఆంధ్రాలో ఏం జరిగినా ఇలానే ప్రశ్నిస్తారు.. తెలంగాణలో ఏం జరుగుతున్న నోరు మూసుకుంటారని వైసిపి అనుకూల నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. ట్విట్టర్లో భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ లాగా పరిస్థితి ఉంటే.. దీనిని అదునుగా తీసుకొని వైసిపి నాటి రిషికొండ వ్యవహారాన్ని.. ప్రస్తుత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదాన్ని ఒకే గాటిన కట్టి.. సరికొత్త చర్చకు తెర లేపుతోంది. అంతేకాదు కొన్ని సినిమాల్లోని వీడియోలను ప్రత్యేకంగా రూపొందించి.. విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఐతే ఇది ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది. అయితే దీనిని టిడిపి నేతలు కొట్టి పారేస్తున్నారు. రిషికొండ వివాదానికి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పటి ప్రకృతి ప్రేమికులు ఇప్పుడు ఎక్కడికి పోయారు రా pic.twitter.com/uLU5lR6k91
— (@karnareddy4512) April 2, 2025