HomeతెలంగాణHarish Rao helps PG medical student: ఇలాంటి నేతలు ఇంకా ఉన్నారా? హరీష్‌ రావు...

Harish Rao helps PG medical student: ఇలాంటి నేతలు ఇంకా ఉన్నారా? హరీష్‌ రావు చేసిన గొప్ప పని ఇదీ

Harish Rao helps PG medical student: రాజకీయ నాయకులు అనగానే.. ఎన్నికల ముందు ఒకమాటా.. ఎన్నికల్లో గెలిచాక ఇంకో మాట చెప్పే రోజులివీ. గెలుపు కోసం హామీలు ఇచ్చి.. గద్దెనెక్కాకా తప్పుచుకోవడమే ప్రస్తుత రాజకీయం. ఇక పదవిని అడ్డు పెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకోవడం కామన్‌. కానీ తెలంగాణ చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఓ పేద విద్యార్థిని వైద్య విద్య కోసం ఏకంగా తన ఇంటినే తాకట్టు పెట్టి రూ.20 లక్షల రుణం ఇప్పించాడు.

సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కూతురు మమత చితంగా ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ప్రభుత్వ కళాశాలలో ఉచితంగా వైద్య విద్య చదివింది. ఇక పీజీ ఎంట్రన్స్‌ రాసింది. మహబూబ్‌నగర్‌ ఎస్‌వీఎస్‌ కళాశాలలో సీటు సాధించింది. మూడేళ్ల కోర్సు పూర్తి చేయడానికి ఏడాదికి రూ.7.50 లక్షల ఫీజు కావాలి. బ్యాంకు రుణం కోసం వెళితే.. ఏదైనా ఆస్తి తాకట్టు పెట్టాలని సూచించారు. దీంతో తనకు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో

హరీశ్‌రావు ఆర్థిక సాయం..
మమత పరిస్థితి గురించి తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మమతను తనంటికి పిలిపించుకున్నాడు. విద్యార్థిని చదువు గురించి ఆరా తీశాడు. రామచంద్రం ఆర్థిక పరిస్థిత తెలుసుకున్నాడు. బ్యాంకు రుణం కోసం స్థిరాస్థి లేదని.. రుణం ఇవ్వడం లేదని తెలిపారు. స్పందించిన హరీశ్‌రావు.. ట్యూషన్, హాస్టల్‌ ఫీజు తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రుణం కోసం హరీశ్‌రావు తన సొంత ఇంటి పత్రాలు తాకట్టు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఈమేరకు తన ఇల్లును బ్యాంకుకు మార్గిగేజ్‌ చేశారు. మమత ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేశారు.

ఈ రోజుల్లో ఇలాంటి నేతలు..
హరీశ్‌రావు చేసిన పనికి సబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు స్పందించారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి లీడర్లు ఉన్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మనసున్న మహారాజు అని కొందరు కామెంట్‌ చేశారు. పబ్లిక్‌ లీడర్‌.. పేదల కష్టం తెలిసిన నాయకుడు.. ట్రబుల్‌ షూటర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రికి మమత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular