HomeతెలంగాణHarish Rao: హరీశ్‌ సవాళ్ల వ్యూహం.. రేవంత్‌ బుక్కయ్యాడా?

Harish Rao: హరీశ్‌ సవాళ్ల వ్యూహం.. రేవంత్‌ బుక్కయ్యాడా?

Harish Rao: తెలంగాణలో అధికారం కోల్పోయాక రాష్ట్రంలో పార్టీ అధినేత కేసీఆర్, ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు వ్యూహాలు తేలిపోతున్నాయి. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. వారిని కట్టడి చేయడంలోనూ త్రిమూర్తులు(కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ) విఫలమవుతున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా, బూమరాంగ్‌ అవుతున్నాయి. అధికార కాంగ్రెస్‌కే ఫేవర్‌గా మారుతున్నాయి.

పారిన రాజీనామా పాచిక..
వ్యూహాలు విఫలమవుతున్నా.. ఎత్తుగడలు చిత్వతున్నా.. అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మానడం లేదు. అదే జరిగితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని గులాబీ నేతలకు తెలుసు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి విసిరిన ఓ సవాల్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు బలం తెచ్చింది. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని, అప్పుడు హరీశ్‌రావు రాజీనామా చేయాలని సవాల్‌ చేశారు. దీనికి హరీశ్‌రావు తగ్గేతే లేదంటూ ముందుకు వచ్చారు. రుణమాఫీతోపాటు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, అలా చేస్తే తాను రాజీనామా చేయడంతోపాటు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని ప్రకటించారు. అంతటితో ఆగకుండా అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని, రాజీనామా పత్రంతో రావాలని సవాల్‌ చేశారు. దీంతో రేవంత్‌ను డిఫెన్స్‌లో పడేశారు.

దీటుగా రేవంత్‌ సమాధానం..
హరీశ్‌ సవాల్‌కు రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. డెడ్‌లైన్‌లోపే రుణమాఫీ చేసి చూపిస్తామని ప్రకటించారు. అలా చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తావా.. అని ప్రశ్నించారు. రుణమాఫీపై ఎంత చర్చ జరిగితే కాంగ్రెస్‌కు అంత మేలు జరుగుతుందని సీఎం రేవంత్‌ భావిస్తున్నారు. కానీ, ఇది హరీశ్‌రావుకే అడ్వాంటేజ్‌ అవుతుందని ఊహించడం లేదు. హరీశ్‌ తనకు పదవికన్నా ప్రజల సమస్యలే ముఖ్యమని సెంటిమెంటు రాజేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌కు చిక్కని రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు హరీశ్‌ ట్రాప్‌లో పడినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు బావిస్తున్నారు. మరోవైపు రుణమాఫీపై చర్చ తమకే లాభిస్తుందని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌పై ఆగ్రహంగా ఉన్న ౖరైతులు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్‌ ఇస్తారని లెక్కలు వేసుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version