https://oktelugu.com/

Sreeleela: ఆ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్.. శ్రీలీల ఇలా షాకిచ్చిందేంటి.?

రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కానప్పటికీ తనకు మాత్రం హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే వచ్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : April 26, 2024 / 01:40 PM IST

    Sreeleela do a item song in Thalapathy Vijay Movie

    Follow us on

    Sreeleela: శ్రీలీల పెళ్లి సందడి సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కానప్పటికీ తనకు మాత్రం హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె తెలుగుతో పాటుగా తమిళ్ సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక అందులో భాగం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో తను ఐటెం సాంగ్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటి వరకు తను ఏ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయలేదు. వరుస గా హీరోయిన్ గానే చేస్తూ సక్సెస్ లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఒక దళపతి విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే తను చివరి సినిమా చేసి సినిమా చేయాలనుకుంటున్నాడు.

    ఇక మొత్తానికైతే తను ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కొట్టి సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలోనే శ్రీలీలా ఐటెం సాంగ్ తో తమిళ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని చూస్తోంది. తను స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్స్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.

    ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం వల్ల శ్రీలీల కెరియర్ కి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఈ ఐటెం సాంగ్ చేయడం వల్ల ఇంకా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటుందా అనే విషయాలు తెలియాలంటే మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక మొత్తానికైతే శ్రీలీల వరుస సినిమాలను లైన్ లో పెడుతూ చాలా బిజీగా మారిపోయింది…