TGPSC Group-1 Exam :గ్రూప్‌–1 పరీక్ష : ఏ జీవోలో ఏముంది.. అభ్యర్థులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు?

తెలంగాణలో గ్రూప్‌–1 గొడవ ముదురుతోంది. పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేయాలని కొంత మంది అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. కోర్టులు పరీక్షలు ఆపొద్దని ఉత్తర్వులు ఇచ్చినా.. అభ్యర్థుల ఆందోళన ఆగడం లేదు.

Written By: Raj Shekar, Updated On : October 20, 2024 12:36 pm

TGPSC Group-1 Exam

Follow us on

TGPSC Group-1 Exam :తెలంగాణలో గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం(అక్టోబర్‌ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించింది టీజీపీఎస్సీ. మరోవైపు పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులు గొడవ మొదలు పెట్టారు. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు రీషెడ్యూల్‌ చేయాలని, జీవో 29 రద్దు చేయాలని కొంత మంది అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 2022లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈమేరకు జీవో 55 జారీ చేసింది. అయితే ప్రశ్నపత్రాలు లీకేజీ, పరీక్షల నిర్వహణలో తప్పిదాల కారణంగా నాలుగైదుసార్లు వాయిదా వేశారు. దీంతో అభ్యర్థుల్లో నైరాశ్యం నెలకొంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. టీఎస్‌పీఎస్సీ పేరును టీజీపీఎస్సీగా మార్చింది. పూర్తిగా ప్రక్షాళణ చేసింది. 2023 ఫిబ్రవరి 8న జీవో 29 ప్రకారం గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ తర్వాత ప్రిలిమ్స్‌ పరీక్షలు సజావుగా నిర్వహించింది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 21 నుంచి మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఈ తరుణంలో గతంలో జారీ చేసిన జీవో 55తో పోల్చుకుంటే.. జీవో 29 కారణంగా రిజర్వుడు కేటగిరీలకు అన్యాయం జరుగుతుందని కొంత మంది అభ్యర్థులు ఆందోళన ప్రారంభించారు. జీవో 29 రద్దు చేయాలని, అప్పటి వరకు గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు రీషెడ్యూల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో జీవో 29లో ఏముంది.. జీవో 55లో ఏముంది.. ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే వివరాలు తెలుసుకుందాం.

షెడ్యూల్‌ ప్రకటించాక కోర్టుకు..
జీవో 29ను ప్రభుత్వం ఫిబ్రవరి 8న జారీ చేసింది. ఆ తర్వాత గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది. అప్పటి వరకు జీవో 29పై ఎలాంటి అభ్యంతరాలు తెలుపని అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స ఫలితాలు ప్రకటించి.. మెయిన్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేశాక జీవో 29 కారణంగా రిజర్వేషపన్లు అమలు కావడం లేదని గ్రూప్‌–1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పదుల సంఖ్యలో కేసులు వేశారు. అయితే హైకోర్టు సింగిల్‌ బెంచ్, డివిజనల్‌ బెంచ్‌ ఈ పిటిషన్లను కొట్టేసింది. పరీక్ష నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇదే రోజు ఉదయం 10:30 గంటలకు జీవో 29 రద్దు పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగనుంది. సుప్రీం కోర్టు ఏం చెబుతుంది అన్నది ఉత్కంఠగా మారింది.

జీవో 29 ప్రకారం మెయిన్స్‌కు..
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులు అయిన వారి నుంచి జీవో 29 ప్రకారం ఒక పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేశారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. నోటిఫికేషన్‌లో ఉన్న 563 పోసుటలకు 28,150 మందిని మెయిన్స్‌కు టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ఇక్కడ పూర్తిగా ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చారు. రిజర్వేషన్లను పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌ మార్కులనే పరిగణనలోకి తీసుకున్నారు.

జీవో 55లో ఇలా..
అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో 55లో వేరుగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రిలిమ్స్‌లోనూ అభ్యర్థులు సాధించిన మార్కులతో సంబంధం లేకుండా రిజర్వేషన్‌ అమలు చేయాలి. దీంతో రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్‌ కోటాతోపాటు ఓపెన్‌ కేటగిరీలో అకవాశం ఉంటుంది. అప్పుడు రిజర్వు కేటగిరీల వారిని 50 శాతం, ఓపెన్‌ కేటగిరీల వారిని 50 శాతం ఎంపిక చేయాలి. దీంతో అభ్యర్థులు భారీగా ఉంటారు. అప్పుడు పరీక్ష నిర్వహణ కష్టతరంగా మారుతుంది. ఓపెన్‌ కేటగిరీలో ఎంపిక చేస్తే.. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఎంపికవుతారు. దీంతో స్థానికులకు అన్యాంయ జరిగే అవకాశం ఉంది అనేది అభ్యర్థుల ఆందోళన.

జీవో 29 ప్రకారం..
జీవో 29 ప్రకారం ఓపెన్‌లో రిజర్వుడు అభ్యర్థులకు అవకాశం ఉండదు. టాప్‌ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో తక్కువ మార్కులు వచ్చిన రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు మెయిన్స్‌కు అవకాశం కోల్పోతారు. జీవో 29లో రిజర్వుడు కేటరిగీ అనే పదం తీసేశారు. దీంతో ఓపెన్‌ ఏటరిగీలో వంద పోస్టులకు 1:50 నిష్పత్తిలో 5 వేల మందిని ఎంపిక చేశారు. ఇందులో రిజర్వుడు కేటరిగీ అభ్యర్థులకు అవకాశం లేదు. జీవో 55 ప్రకారం ఓపెన్‌ పోస్టుల్లోనూ 50 శాతం మంది మాత్రమే ఓపెన్‌ కేటరిటీ ఉండి.. మిగతా 50 శాతం మంది రిజర్వుడు కేటగిరీ ఉండాలి అంటే 2,500 మంది ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు, 2,500 మంది రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు ఉండాలి. జీవో 29 తో ఈ అవకాశం లభించలేదు. దీనినే అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు.

రిజర్వేషన్లు లేవా…
అయితే జీవో 29 ప్రకారం ఓసీ కేటగిరీలోని అభ్యర్థులకు ఎక్కువ లాభం జరుగుతుంది. 1:50 ప్రకారం 563 పోస్టులకు 28,160 మంది ఎంపిక చేయాల్సి ఉండగా ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు 5 వేల మందిని ఎక్కువగా ఎంపిక చేశారు. దీంతో ఓపెన్‌ అభ్యర్థుల సంఖ్య 31,383కి పెరిగింది. దీంతో ఓసీలకు ఎక్కువ లబ్ధి జరుగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జీవో 29 రద్దు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.