Rs 15000 per farmer: తెలంగాణలో రైతులు ఎప్పటికీ ఏదో రకంగా మోసపోతూనే ఉంటున్నారు. ఈ విషయంలో రైతులు ఎంత పగడ్బందీగా ఉన్నా కొన్ని కంపెనీలు రకరకాలుగా మోసం చేస్తున్నారు. అయితే గత క్రాఫ్ లో పత్తి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ నష్టానికి జన్యు మార్పిడి విత్తనాలే కారణమని తేలింది. కంపెనీలు జన్యు మార్పిడి చేసిన తర్వాత కొన్నాళ్లపాటు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అవి పంటకు అనుగుణంగా ఉంటాయా? లేదా? అని నిర్ణయించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకురావాలి. కానీ కంపెనీలు అలా చేయకుండా రైతులకు విక్రయించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత పరిహారం కోసం రోడ్డెక్కారు. అయితే వీరిని ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోనుంది. అదెలా అంటే?
తెలంగాణలోని ములుగు జిల్లాకు చెందిన రైతులు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగును చేశారు. అయితే ఓ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు. ఈ విత్తనాలు ఎన్నాళ్లు గడిచిన మొలకెత్తలేదు. అంతేకాకుండా మొలకెత్తిన విత్తనాలకు కంకులు కనిపించలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన రైతులు.. అసలు విషయం ఏంటో తెలుసుకున్నారు. ఇవి జన్యు మార్పిడి చేసిన విత్తనాలు అని గుర్తించారు. దీంతో తమను కంపెనీలు మోసం చేశాయని ఆందోళన చెందుతూ రోడ్డు ఎక్కారు. దాదాపు రెండు నెలల పాటు ఈ ఆందోళనలు కొనసాగాయి. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత బాధ్యులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు వారు తమదైన శైలిలో ప్రయత్నించారు.
చివరికి నవనిర్మాణ సేన సభ్యులు ఈ విషయాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు తీసుకెళ్లారు. అయితే దీనిపై రిపోర్టు ఇవ్వాలని కోరగా ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం అందించిన రిపోర్టు ప్రకారం 2, 178 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తేలింది. ఆ తర్వాత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో కంపెనీలు రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. మొత్తం నాలుగు కంపెనీలు పది రోజుల్లో ఈ పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు ఒక్కో రైతుకు రూ:15,000 నుంచి రూ.85,000 దాకా ఇవ్వనున్నాయి. మొత్తంగా రైతులు చేసిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించడంతో వారి సమస్యకు పరిష్కారం దొరికినట్లు అయింది.
Also Read: Adilabad: చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకుల గల్లంతు.. వీడియో వైరల్
ఇదే సమయంలో నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా రైతులు నాణ్యమైన విత్తనాలను చూసి కొనుగోలు చేయాలని కోరుతోంది. కొందరు తక్కువ ధరకు విత్తనాలు విక్రయించే అవకాశం ఉందని.. ఇలాంటి వలలో రైతులు చిక్కుకోవద్దని పేర్కొంటుంది. అంతేకాకుండా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని తెలుపుతోంది.